Aryan Khan : ఆర్య‌న్‌ఖాన్‌కు అన‌న్య‌ పాండే షాక్‌..? ఎన్‌సీబీ అధికారుల ఎదుట నిజాలు చెప్పేసింది..?

October 23, 2021 1:23 PM

Aryan Khan : క్రూయిజ్ షిప్ లో ఓ డ్ర‌గ్స్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ ఆర్య‌న్‌ఖాన్ మ‌రిన్ని చిక్కుల్లో ఇరుక్కోబోతున్నాడా ? అంటే.. అందుకు అవున‌నే సమాధానాలు వినిపిస్తున్నాయి. అన‌న్య పాండేను ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే విచార‌ణ‌లో భాగంగా ఆమె ఆర్య‌న్ ఖాన్‌కు సంబంధించి నిజాల‌ను ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

ananya pandey shock to Aryan Khan she may be told the truth to ncb

ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ పుచ్చుకున్నాడా ? లేదా ? అని ఎన్‌సీబీ అధికారులు అన‌న్య పాండేను ప్ర‌శ్నించార‌ట‌. అయితే ఆర్య‌న్ డ్ర‌గ్స్ తీసుకున్నాడు కానీ.. అత‌నికి ఆ డ్ర‌గ్స్ ఎవ‌రు స‌ర‌ఫ‌రా చేశారు ? అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌వ‌ట‌. దీంతో కేసు కీల‌క మ‌లుపు తిరిగిన‌ట్ల‌యింది. ఈ క్ర‌మంలో ఆర్య‌న్‌ఖాన్ గురించి అన‌న్య మ‌రిన్ని నిజాలు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నిజాలు చెప్ప‌కపోతే అన‌వ‌స‌రంగా తాను ఇరుక్కుంటానేమోన‌ని భ‌య‌ప‌డ్డ అన‌న్య అప్రూవ‌ర్‌గా మారింద‌ని తెలుస్తోంది. అందుక‌నే త‌న‌కు డ్ర‌గ్స్‌తో సంబంధం లేద‌ని, ఆర్య‌న్ వాటిని తీసుకున్నాడ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటిష‌న్‌ను ఇప్ప‌టికే కోర్టు ప‌లుమార్లు తిర‌స్క‌రించ‌గా.. మంగ‌ళ‌వారం కూడా మ‌రోమారు బెయిల్ పిటిష‌న్‌ను విచారించ‌నున్నారు. కానీ ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు రుజువు అయితే అత‌నికి బెయిల్ రాక‌పోవ‌చ్చ‌ని అంటున్నారు.

ఇక షారూఖ్ ఖాన్ మేనేజ‌ర్ పూజ ఎన్‌సీబీ ఆఫీస్‌కు వెళ్లి అక్క‌డ గంట‌న్న‌ర పాటు ఉంది. త‌రువాత తిరిగి వ‌చ్చాక ఆమె చేతిలో ఒక ఎన్వ‌ల‌ప్ క‌నిపించింది. అందులో ఆర్య‌న్ ఖాన్‌కు చెందిన కీల‌క ప‌త్రాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now