Amazon Prime : యూజ‌ర్ల‌కు షాకిచ్చిన అమెజాన్‌.. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ చార్జి పెంపు.. కానీ ఆఫ‌ర్ ఉంది..!

October 27, 2021 3:10 PM

Amazon Prime : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న యూజ‌ర్ల‌కు షాకిచ్చింది. వార్షిక స‌భ్య‌త్వ రుసుమును పెంచుతున్న‌ట్లు తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏడాదికి రూ.999 చెల్లిస్తే మెంబ‌ర్ షిప్ వ‌చ్చేది. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీలు, సిరీస్‌లు చూసే అవ‌కాశం ఉంటుంది. అలాగే అమెజాన్ సైట్‌లోనూ వ‌స్తువుల‌ను ఎలాంటి డెలివ‌రీ చార్జిలు లేకుండా వేగంగా డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. అయితే ప్రైమ్ మెంబ‌ర్ షిప్ చార్జిని పెంచుతున్న‌ట్లు తెలిపింది.

Amazon Prime member ships rates increases but offer available

అమెజాన్ త‌న ప్రైమ్ మెంబ‌ర్ షిప్ సర్వీస్‌ను తొలిసారిగా 2016లో లాంచ్ చేసింది. అప్ప‌ట్లో రూ.499కు ఏడాది మెంబ‌ర్‌షిప్‌ను ఇచ్చారు. 2017లో ఆ రుసుమును రూ.999 చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అదే రుసుము కొన‌సాగుతూ వచ్చింది. కానీ దాన్ని రూ.500 మేర పెంచారు. దీంతో ఇక‌పై యూజ‌ర్లు ఏడాదికి రూ.1499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది.

అయితే కొంత‌కాలం పాటు పాత చార్జినే వ‌సూలు చేస్తామ‌ని అమెజాన్ తెలిపింది. అందువ‌ల్ల ప్ర‌స్తుతానికి రెన్యువ‌ల్ లేదా కొత్త‌గా మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే రూ.999 చెల్లిస్తే చాలు. అయితే ఈ ఆఫ‌ర్ ఎన్ని రోజుల వ‌ర‌కు ఉంటుంద‌నే వివ‌రాల‌ను అమెజాన్ వెల్ల‌డించ‌లేదు. క‌నుక అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ రెన్యువ‌ల్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌వారు లేదా కొత్త‌గా మెంబ‌ర్‌షిప్ తీసుకోవాల‌ని అనుకుంటున్న‌వారు ఇప్పుడే ఆ మెంబ‌ర్‌షిప్‌ను తీసుకుంటే మంచిది. దీంతో రూ.500 ఆదా చేయ‌వ‌చ్చు.

ఇక 18 నుంచి 24 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారికి ప్రైమ్ యూత్ ఆఫ‌ర్ ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వ‌య‌స్సు ఉన్న యూజ‌ర్లు వార్షిక స‌భ్య‌త్వం తీసుకుంటే రూ.500, 3 నెల‌ల మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే రూ.165 క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

కాగా అమెజాన్ ప్రైమ్‌కు చెందిన నెల‌వారీ, 3 నెల‌ల‌, వార్షిక మెంబ‌ర్‌షిప్ ప్లాన్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

* నెల వారీ ప్లాన్ – పాత చార్జి రూ.129, కొత్త చార్జి రూ.179

* 3 నెల‌ల మెంబ‌ర్‌షిప్ – పాత చార్జి రూ.329, కొత్త చార్జి రూ.459

* ఏడాది మెంబ‌ర్‌షిప్ – పాత చార్జి రూ.999, కొత్త చార్జి రూ.1499

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment