Amazon Jobs : ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలను పొందడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో వారు ఉద్యోగాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక ఫ్రెషర్స్ సంగతి సరే సరి. అయితే ఏ డిగ్రీ ఉన్నా సరే.. అనుభవం లేకపోయినా ఫ్రెషర్స్ అయినా సరే.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అలాంటి అభ్యర్థులకు ఉద్యోగాలను ఇస్తోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే కంపెనీయే ల్యాప్‌టాప్ అందిస్తుంది. ఇంటి నుంచి కూడా పనిచేయవచ్చు. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్ సంస్థ హైదరాబాద్ రీజియన్‌లో పనిచేసేందుకు గాను బిజినెస్ ఆపరేషన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైతే మొదటి 2 నెలల పాటు ట్రెయినింగ్ ఉంటుంది. ఈ సమయంలో రూ.20వేలను నెలకు చెల్లిస్తారు. అలాగే ట్రెయినింగ్ అనంతరం నెలకు రూ.35వేల ప్రారంభ జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక ఉద్యోగం చేయాలనుకున్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోనూ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా కంపెనీయే అందిస్తుంది.
ఏదైనా డిగ్రీ ఉన్నవారు, ఫ్రెషర్స్ లేదా ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. అయితే అభ్యర్థులకు పలు స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్ఎల్ లో మెళకువలు తెలిసి ఉండాలి. అలాగే ఓరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండాలి. దీంతోపాటు ఈ-కామర్స్, బిజినెస్ సైట్లపై ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలు తెలిసి ఉండాలి.
ఇలా అభ్యర్థులు తమకు ఆయా స్కిల్స్, అర్హతలు ఉన్నాయనుకుంటే ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అందుకు గాను https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/ అనే వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించి అక్కడ సూచించిన విధంగా దరఖాస్తు ఫామ్‌ను నింపి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రోజులో 24 గంటల్లో ఏ షిఫ్టులోనైనా సరే పనిచేయాల్సి ఉంటుంది. అయితే 3-4 నెలలకు ఒకసారి షిఫ్ట్ చేంజ్ చేస్తారు. ఇక వారంలో 5 రోజులే పని ఉంటుంది. మిగిలిన 2 రోజులు వీక్లీ ఆఫ్ లను వరుసగా ఇస్తారు. అయితే శని, ఆది వారాల్లో వీక్లీ ఆఫ్‌లను ఇవ్వరు. కానీ వారంలో ఏ రెండు రోజులు అయినా సరే వరుసగా వీక్లీ ఆఫ్‌లను ఇస్తారు. ఇలా ఈ ఉద్యోగంలో సదుపాయాలు ఉంటాయి. మరిన్ని వివరాలకు ముందు ఇచ్చిన సైట్‌ను సందర్శించవచ్చు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…