Raja Abel : తెలుగు ప్రేక్షకులకు నటుడు రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గతంలో పలు హిట్ చిత్రాల్లో నటించారు. అయితే రాను రాను ఈయనకు ఆఫర్లు తగ్గాయి. తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు రాజా ఆయన వెంట నడిచారు. అయితే ఆ తరువాత రాజకీయ కెరీర్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం రాజా పాస్టర్‌గా మారారు. దేవుని సువార్తను ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో రాజా ఆయన వెంట తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. అయితే అప్పట్లో రాజా పవన్‌పై రాజకీయాల పరంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని.. ఆయనకు ప్రజా సమస్యలు తెలియవని రాజా అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా చనిపోయాడని ప్రచారం చేశారు. అయితే అప్పట్లో జరిగిన ఆ సంఘటనలను తలచుకుని రాజా విచారం వ్యక్తం చేశారు.
అప్పట్లో తాను రాజకీయాల పరంగా పవన్‌పై కామెంట్లు చేశానేకానీ.. వ్యక్తిగతంగా ఆయనంటే ఎలాంటి దురుద్దేశం లేదని రాజా అన్నారు. పవన్ మంచి వ్యక్తిత్వం, మంచి మనసు ఉన్న వ్యక్తి అని.. కానీ ఆయన ఫ్యాన్సే మూర్ఖులని అన్నారు. తన ఫ్యాన్స్‌కు మాటలు అదుపులో పెట్టుకోవాలని పవన్ ఎన్నోసార్లు చెప్పారని.. అయినా వారు వినడం లేదని.. వారు మూర్ఖుల్లా తయారయ్యారని.. అలాంటి వారికి చెప్పి కూడా వేస్ట్ అని.. రాజా అన్నారు.
అప్పట్లో తాను పవన్‌పై రాజకీయాల పరంగా చేసిన కామెంట్లను పట్టుకుని తాను చనిపోయానని పవన్ ఫ్యాన్స్ ప్రచారం చేశారని.. ఇది తనను బాధించిందని అన్నారు. అయితే అక్కడి వరకు ఆగితే ఫర్వాలేదు. కానీ పవన్ ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారని.. తన మూడేళ్ల కుమార్తెపై కూడా నీచంగా వ్యాఖ్యలు చేశారని.. రాజా గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. పవన్ అంటే తనకు ఎంతో అభిమానమని, చిరంజీవి అన్నా అభిమానిస్తానని.. ఒకసారి తన ఫ్యాన్స్ వెళ్లి చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారని.. ఇందుకు చిరంజీవి తనను అభినందించారని.. తనకు ఆయన ఒక లేఖను కూడా రాశారని.. అదిప్పటికీ తన వద్ద భద్రంగా ఉందని రాజా అన్నారు.
అయితే పవన్, చిరంజీవి మంచి మనసు, దాన గుణం ఉన్న వ్యక్తులే అయినా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం అతి చేస్తారని.. వారు చెప్పినా వినిపించుకోరని.. వారి వల్ల పవన్ పొలిటికల్ కెరీర్‌కు ఎప్పటికైనా ప్రమాదం తప్పదని.. రాజా హెచ్చరించారు. కాగా రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…