TikTok : టిక్‌ టాక్‌ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌.. భారత్‌లోకి మళ్లీ వస్తోంది..!

TikTok : మన దేశంలో ఒకప్పుడు టిక్‌టాక్‌ యాప్‌ సృష్టించిన హల్‌ చల్‌ అంతా ఇంతా కాదు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్‌ చేయడం పరిపాటిగా మారింది. దీంతో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై స్టార్లుగా మారారు. టిక్‌ టాక్‌ స్టార్‌ అనే బిరుదును తెచ్చుకున్నారు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. దేశభద్రతకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు తెలియజేసింది. వాటిల్లో టిక్‌టాక్‌ కూడా ఒకటి. అయితే ఈ యాప్‌ను నిషేధించాక చాలా మంది టిక్‌టాక్‌ యూజర్లు ఇతర యాప్‌లను వాడడం మొదలు పెట్టారు.

టిక్‌టాక్‌ నిషేధం అనంతరం ఎంఎక్స్‌ టకాటాక్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, చింగారి వంటి యాప్‌లు పాపులర్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యాప్‌లలో యూజర్లు మళ్లీ వీడియోలను అప్ లోడ్‌ చేయడం మొదలు పెట్టారు. అయితే టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ తాజాగా భారతీయ యూజర్లకు అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. త్వరలోనే మళ్లీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనం ద్వారా తెలుస్తోంది. దీంతో టిక్ టాక్‌ మళ్లీ భారత్‌లోకి వస్తుందన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనను మాత్రం వెల్లడించలేదు.

TikTok

గతంలో భారత్‌ నిషేధించిన యాప్‌లలో ప్రముఖ యాప్‌ టిక్ టాక్‌ ఉంది. దీంతోపాటు పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. అయితే ఆ గేమ్‌ డెవలపర్‌ అయిన క్రాఫ్టన్‌ సంస్థ చైనా సంస్థ అయిన టెన్సెంట్‌ గేమ్స్‌తో తెగదెంపులు చేసుకుంది. భారత్‌లో సొంతంగానే పబ్‌జి ని మళ్లీ రిలీజ్‌ చేసింది. దానికి బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియాగా పేరు మార్చి లాంచ్‌ చేసింది. దీంతో పబ్‌జి మళ్లీ భారత్‌లోకి వచ్చింది. కానీ టిక్ టాక్‌ మాత్రం ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు. కారణం దాని మాతృసంస్థ బైట్‌ బ్యాన్స్‌ పూర్తిగా చైనా సంస్థనే. కనుక ఆ సంస్థ మన దేశంలో మనుగడ సాగించలేదు. కానీ ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యం అయి డేటాను కూడా ఇక్కడే స్టోర్‌ చేస్తే మళ్లీ మన మార్కెట్‌లో ప్రవేశించవచ్చు. కనుక బైట్‌ డ్యాన్స్‌ సంస్థ భారత్‌కు చెందిన హిరనందని గ్రూప్‌తో భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది. దీంతో టిక్‌టాక్‌ను త్వరలోనే భారత్‌లో మళ్లీ రిలీజ్‌ చేయనున్నారని సమాచారం.

ఇక అనుకున్న ప్రకారం జరిగితే మరో ఏడాదిలోగానే టిక్‌టాక్‌ భారత్‌లో మళ్లీ లాంచ్‌ అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించి 2 ఏళ్లు అవుతోంది. ఈ యాప్‌ భారత్‌లో మళ్లీ వస్తే టిక్‌టాక్‌ మరింత పాపులర్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర యాప్స్‌ దెబ్బకు ఢమాల్‌ అనడం ఖాయం. మరి టిక్‌టాక్‌ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM