Finger Millets : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలా ఎంతో మంది మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. తరచూ రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఏవిధమైనటువంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* రాగులలో కాల్షియం అధికంగా లభిస్తుంది. నిత్యం రాగి జావ తీసుకోవడం వల్ల తగినంత మోతాదులో క్యాల్షియం మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
*జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాలలో రాగులు ఉండేలా చూసుకోవాలి. రాగులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.
* రాగులు చర్మంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే రాగి పిండితో ముఖంపై మర్దనా చేయడంవల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం ఎంతో కాంతివంతంగా బిగుతుగా మారుతుంది. దీంతోపాటు ముడతలు రాకుండా కాపాడుతాయి. అలాగే రాగులను తీసుకుంటే బద్దకం తగ్గుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.
* మధుమేహంతో బాధపడేవారికి రాగులు దివ్యౌషధమనే చెప్పాలి. తరచూ రాగి జావ, రాగి ముద్ద వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…