Finger Millets : రాగుల‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. ఈ రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

March 22, 2022 11:08 AM

Finger Millets : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలా ఎంతో మంది మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. తరచూ రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఏవిధమైనటువంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Finger Millets
Finger Millets

* రాగులలో కాల్షియం అధికంగా లభిస్తుంది. నిత్యం రాగి జావ తీసుకోవడం వల్ల తగినంత మోతాదులో క్యాల్షియం మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.

*జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాలలో రాగులు ఉండేలా చూసుకోవాలి. రాగులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను త‌గ్గిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

* రాగులు చర్మంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే రాగి పిండితో ముఖంపై మర్దనా చేయడంవల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం ఎంతో కాంతివంతంగా బిగుతుగా మారుతుంది. దీంతోపాటు ముడతలు రాకుండా కాపాడుతాయి. అలాగే రాగుల‌ను తీసుకుంటే బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.

* మధుమేహంతో బాధపడేవారికి రాగులు దివ్యౌషధమనే చెప్పాలి. తరచూ రాగి జావ‌, రాగి ముద్ద వంటి వాటిని తీసుకోవ‌డం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now