Amala Paul : గోవాలో ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్న అమ‌లాపాల్‌..!

November 5, 2021 8:40 AM

Amala Paul : క‌రోనా నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌కు లాక్ ప‌డిన కార‌ణంగా చాలా మంది సెల‌బ్రిటీలు మాల్దీవుల‌కు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్ర‌భావం అంత‌గా లేదు. దీంతో ఎక్క‌డికంటే అక్క‌డికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా సినీ ప‌రిశ్ర‌మ ఎంతో ఒత్తిడికి గురైంది. న‌టీన‌టులు కూడా త‌మ సినిమాలు ఏమ‌వుతాయోన‌ని దిగులు చెందారు.

Amala Paul enjoying in goa

అయితే ఇప్పుడు నెమ్మ‌దిగా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌డంతో.. త‌మ‌పై ఉన్న ఒత్తిడిని అంతా తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తార‌లు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఎంజాయ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే మాలీవుడ్ క్వీన్ అమ‌లాపాల్ కూడా గోవాలో తెగ ర‌చ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల‌ను బ‌ట్టి చూస్తే.. ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో సూర్య కిర‌ణాల అందాల‌ను ఆస్వాదిస్తూ.. మ‌ద్యం సేవిస్తుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇక అమ‌లాపాల్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు త‌మిళ సినిమాలు ఉన్నాయి. కాడ‌వ‌ర్‌, అదో అంధ ప‌ర‌వై పోలా అనే మూవీల‌ను ఆమె చేస్తోంది. అలాగే ఆడుజీవితం అనే మ‌రో మ‌ళ‌యాళం సినిమాలోనూ న‌టించింది. ఇవ‌న్నీ ఎప్ప‌టి నుంచో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment