Allu Ramalingaiah : అల్లు రామలింగయ్య జయంతికి ముగ్గురు మనవళ్ళు ముచ్చటైన సర్‌ప్రైజ్‌..!

October 1, 2021 2:36 PM

Allu Ramalingaiah : సినిమా ఇండస్ట్రీలో నటుడు అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో విలక్షణ నటుడిగా, కమెడియన్ గా వెయ్యికి పైగా చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అరవింద్ అడుగు పెట్టారు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా అల్లు రామలింగయ్య మనవళ్లు అల్లు అర్జున్, అల్లు వెంకట్, శిరీష్ లు అందరికీ తెలిసిందే.

Allu Ramalingaiah : అల్లు రామలింగయ్య జయంతికి ముగ్గురు మనవళ్ళు ముచ్చటైన సర్‌ప్రైజ్‌..!
Allu Ramalingaiah

నేడు అల్లు రామలింగయ్య జయంతి కావడంతో తమ కుటుంబ సభ్యులు జయంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అల్లు రామలింగయ్య మనవళ్ళు బన్నీ, శిరీష్, వెంకట్ తమ తాతయ్యకు ఘన నివాళి అర్పించారు. అల్లు కుటుంబం నిర్మిస్తున్న అల్లు స్టూడియోస్ లో ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఈ ముగ్గురు మనవళ్ళు ఆవిష్కరించారు.

https://www.instagram.com/p/CUeIs7ehM4w/?utm_source=ig_web_copy_link

ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నేడు తాతయ్య జయంతి కావడంతో ముగ్గరం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాము. ఆయన మాకు గర్వకారణం, అల్లు స్టూడియోస్ నిర్మాణ ప్రయాణంలో ఆయన తోడుగా ఉంటారు.. అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తాత గురించి చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment