Allu Arjun Pushpa : అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాణం ఆలస్యం కావడంతో విడుదల తేదీ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కరోనా రెండవ దశ అనంతరం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మరోసారి షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజుల వరకు మారేడుమిల్లి అడవి ప్రాంతంలో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గులాబ్ తుఫాన్ కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇలా వర్షం కారణంగా సినిమా వాయిదా పడటంతో ఈ సినిమా అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసుకోవడం కష్టతరమవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.
A song from #PushpaTheRise was shot at a beautiful and picturesque location few days back ❤️
Update about the most awaited Second Single soon 🎶#Pushpa #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/bki2EvrZGP
— Mythri Movie Makers (@MythriOfficial) September 27, 2021
ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడటంతో అనుకున్న ప్రకారం ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేస్తామా.. లేదా.. అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎన్నో అప్ డేట్స్ విడుదల చేయగా తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే ఒక గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను అలరిస్తోంది.