Allu Arjun : టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి జంట ఒకటి. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బన్నీ సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయం కేటాయిస్తూ ఉంటాడు. కరోనా వల్ల వీరు ఎటూ వెళ్లలేకపోయారు. ఈ మధ్యే కాస్త బయట అడుగుపెడుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులో వాలిపోయాడు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు.
బన్నీ సతీమణి స్నేహా రెడ్డి తాము మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియో ద్వారా తెలియజేసింది. వీడియోలో అర్హ, ఆయాన్, బన్నీ స్విమ్మింగ్ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అక్కడి ప్రాంతం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియోకి నెటిజన్స్ నుండి సూపర్భ్ రెస్పాన్స్ వస్తోంది.
దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో ముచ్చటగా మూడో సారి జతకట్టాడు బన్నీ. పుష్ప అనే సినిమాతో త్వరలో వీరు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండో పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిధ్ శ్రీరామ్ ఆలపించారు. చంద్రబోస్ రచించారు. పూర్తిగీతం ఈ నెల 13న విడుదలకానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…