Allu Arjun : మాల్దీవుల‌లో బ‌న్నీ ఫ్యామిలీ ఎంత‌గా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..!

October 12, 2021 8:02 PM

Allu Arjun : టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి జంట ఒక‌టి. వీరికి అయాన్, అర్హ అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. బ‌న్నీ సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత స‌మ‌యం కేటాయిస్తూ ఉంటాడు. క‌రోనా వ‌ల్ల వీరు ఎటూ వెళ్లలేక‌పోయారు. ఈ మ‌ధ్యే కాస్త బ‌య‌ట అడుగుపెడుతున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవులో వాలిపోయాడు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్‌, కూతురు అర్హలతో కలిసి అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

Allu Arjun enjoying with family in maldives

బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి తాము మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తున్న‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేసింది. వీడియోలో అర్హ, ఆయాన్‌, బన్నీ స్విమ్మింగ్‌ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్నట్టుగా క‌నిపిస్తున్నారు. అక్క‌డి ప్రాంతం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. స్నేహా రెడ్డి షేర్ చేసిన వీడియోకి నెటిజ‌న్స్ నుండి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

https://www.instagram.com/reel/CU7GNu8FICX/?utm_source=ig_embed&ig_rid=965e7609-398e-4893-9be2-0c5dd61c0daf

దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో ముచ్చ‌ట‌గా మూడో సారి జ‌త‌క‌ట్టాడు బ‌న్నీ. పుష్ప అనే సినిమాతో త్వ‌ర‌లో వీరు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా రెండో పాటకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే గీతాన్ని తెలుగులో సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. చంద్రబోస్‌ రచించారు. పూర్తిగీతం ఈ నెల 13న విడుదలకానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now