Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.
ఇక ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లతో సైతం బిజీగా ఉన్న అల్లు అర్జున్ తాజాగా ఒక విద్యా సంస్థను ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. 1986 విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో ఎంతో గొప్ప ప్రయాణాన్ని ఆరంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఐకాన్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోను దసరా కానుకగా చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విడుదల చేసింది.
ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఐఐటీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య” అని చెప్పడంతో పాటు “మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్యని ఎంపిక చేసుకోవడంలో ఏ మాత్రమ్ తగ్గేదేలే”అంటూ తనదైన శైలిలో డైలాగులు చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…