గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Allu Arjun : ఆ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ !

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా…

Allu Arjun : ఆ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్ !

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

Allu Arjun became brand ambassador for sri chaithanya institutes

ఇక ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ లతో సైతం బిజీగా ఉన్న అల్లు అర్జున్ తాజాగా ఒక విద్యా సంస్థను ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. 1986 విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో ఎంతో గొప్ప ప్రయాణాన్ని ఆరంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఐకాన్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోను దసరా కానుకగా చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విడుదల చేసింది.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఐఐటీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య” అని చెప్పడంతో పాటు “మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్యని ఎంపిక చేసుకోవడంలో ఏ మాత్రమ్ తగ్గేదేలే”అంటూ తనదైన శైలిలో డైలాగులు చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి