Allu Arha : నాలుగున్నర ఏళ్ల వయస్సులో సహజంగానే అంతగా పిల్లలకు పెద్దగా ప్రతిభా పాటవాలు ఉండవు. కానీ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మాత్రం ఆ వయస్సులో ఏకంగా చెస్‌లోనే వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రఖ్యాత నోబుల్ అవార్డును అందుకుంది. ఈ వయస్సులో ఆమె చెస్ ఆడడమే కాదు, ఎంతో మందికి చెస్‌లో ట్రెయినింగ్ ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ చెస్‌లో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె తన తోటి స్నేహితులకు, తమ ఇంట్లో పనిచేసేవారికి చెస్‌లో ట్రెయినింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2 నెలల్లోనే అల్లు అర్హ సుమారుగా 50 మందికి పైగానే చెస్‌లో ట్రెయినింగ్ ఇచ్చింది. దీంతో అర్హ ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధి, ఆర్బిటర్ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు తాజాగా నైపుణ్య పరీక్షను నిర్వహించారు.
ఆ నైపుణ్య పరీక్షలో అల్లు అర్హ సత్తా చాటింది. ఆమె ప్రతిభా పాటవాలను గుర్తించిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు (Worlds Youngest chess Trainer Award)ను అందించారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల సమక్షంలోనే అల్లు అర్హ ఆ అవార్డును అందుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…