గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Allu Arha : వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ‌.. అవార్డు అందుకుంది..!

Allu Arha : నాలుగున్న‌ర ఏళ్ల వ‌య‌స్సులో స‌హ‌జంగానే అంత‌గా పిల్ల‌ల‌కు పెద్ద‌గా ప్ర‌తిభా పాట‌వాలు ఉండ‌వు. కానీ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మాత్రం ఆ వ‌య‌స్సులో ఏకంగా చెస్‌లోనే వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. ప్ర‌ఖ్యాత…

Allu Arha : వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ‌.. అవార్డు అందుకుంది..!

Allu Arha : నాలుగున్న‌ర ఏళ్ల వ‌య‌స్సులో స‌హ‌జంగానే అంత‌గా పిల్ల‌ల‌కు పెద్ద‌గా ప్ర‌తిభా పాట‌వాలు ఉండ‌వు. కానీ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మాత్రం ఆ వ‌య‌స్సులో ఏకంగా చెస్‌లోనే వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. ప్ర‌ఖ్యాత నోబుల్ అవార్డును అందుకుంది. ఈ వ‌య‌స్సులో ఆమె చెస్ ఆడ‌డ‌మే కాదు, ఎంతో మందికి చెస్‌లో ట్రెయినింగ్ ఇస్తూ.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Allu Arha world record got youngest chess trainer award

హైద‌రాబాద్‌లోని హైటెక్‌సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడ‌మీలో అల్లు అర్హ చెస్‌లో శిక్ష‌ణ తీసుకుంది. ఆ త‌రువాత ఆమె త‌న తోటి స్నేహితుల‌కు, త‌మ ఇంట్లో ప‌నిచేసేవారికి చెస్‌లో ట్రెయినింగ్ ఇవ్వ‌డం ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే 2 నెల‌ల్లోనే అల్లు అర్హ సుమారుగా 50 మందికి పైగానే చెస్‌లో ట్రెయినింగ్ ఇచ్చింది. దీంతో అర్హ ప్ర‌తిభ‌ను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్​‍ రికార్డ్‌ సంస్థ ప్రతినిధి, ఆర్బిటర్‌ చొక్కలింగం బాలాజీ పర్యవేక్షణలో అర్హకు తాజాగా నైపుణ్య పరీక్షను నిర్వహించారు.

ఆ నైపుణ్య ప‌రీక్ష‌లో అల్లు అర్హ స‌త్తా చాటింది. ఆమె ప్ర‌తిభా పాట‌వాల‌ను గుర్తించిన నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్​‍ రికార్డ్స్ సంస్థ ఆమెకు వరల్డ్​‍ యంగెస్ట్‌ చెస్ ట్రైనర్‌ అవార్డు (Worlds Youngest chess Trainer Award)ను అందించారు. అల్లు అర్జున్‌, స్నేహా రెడ్డిల స‌మ‌క్షంలోనే అల్లు అర్హ ఆ అవార్డును అందుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి