Ali Basha : ఆలీ సంపాదన ఎంతో తెలిస్తే క‌చ్చితంగా షాకవుతారు.. ఇప్పటివరకు ఎంత సంపాదించారంటే..?

November 27, 2022 8:41 AM

Ali Basha : ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించి సీతాకోకచిలుక చిత్రం ద్వారా నటన పరంగా మంచి గుర్తింపు పొందాడు. బాలనటుడుగా, హాస్యనటుడుగా దాదాపు 1100 చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకానొక సమయంలో హీరోగా కూడా కొన్ని సినిమాలు నటించి ప్రేక్షకులను అలరించాడు . వాటిలో కొన్ని సక్సెస్ సాధించగా, ఆ తర్వాత పరాజయాలు రావటంతో హీరో ట్రాక్ వదిలేసి మరల కమెడియన్ గా మారి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు.

అలీ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా ఆలీతో సరదాగా అంటూ ఎంతోమంది సినీ తారలను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉన్నాడు. అలా రెండు చేతుల సంపాదిస్తున్నాడు అలీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలీ అటు సినిమాల్లోనూ ఇటు పలు టీవీ షోలను బిజీగా ఉంటూ ఎంత ఆస్తి వెనక వేసి ఉంటాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అలీ సంపాదన ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

Ali Basha assets and properties value
Ali Basha

అలీ ఆస్తి దాదాపుగా 750 కోట్లకు పైగానే ఉంటుందట. డబ్బును దాచి అపుడప్పుడు కొంత మొత్తాలతో స్థలాలను కొనేసాడట అలీ. ఆ స్థలాలు అన్ని బాగా రేట్లు పెరిగిపోవటంతో అలీ ఆస్తి డబల్ అయిందని సమాచారం వినిపిస్తుంది. అలీ నటుడిగా తన సంపాదన ఒక ఏడాదికి 8 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ఉంటుందని గతంలో టాక్ వినిపించింది.

అంతే కాకుండా అలీకి హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో 2 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని, కొన్ని లక్షల విలువ చేసి సూపర్ లగ్జరీ కారు ఉందని తెలుస్తోంది. తనకున్న ఆస్తిలో పేద ప్రజలకు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడట అలీ. పేద వాళ్లకు దాదాపు నెలకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసాడని తెలిసింది. అలీకి ఇంత ఆస్తి ఉన్నా ఏ రోజు కూడా తనలో పొగరు పెరగలేదని ఆయన సన్నిహితులు అంటుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now