Akira Nandan : అకీరా నంద‌న్ వెండితెర ఎంట్రీకి టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. తండ్రి సినిమాతో ఎంట్రీనా ?

October 26, 2021 11:29 PM

Akira Nandan : అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ సినిమాలు మానేశాడు. దీంతో కొన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ఇక వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. దీంతో వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ త‌న‌యుడి ఎంట్రీ కోసం అంద‌రూ ఎదురు చూస్తుండ‌గా, ఓ వార్త అభిమానుల‌ని ఆనందింప‌జేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.

Akira Nandan may enter into film industry with pawan kalyan film

పవన్ కళ్యాణ్‌ నటిస్తోన్న తొలి పీరియాడిక్ మూవీ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌. ఇప్ప‌టికే సినిమా అర‌వై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. భీమ్లా నాయ‌క్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత ప‌వ‌న్ ఈ సినిమాపై ఫుల్ ఫోక‌స్ పెడ‌తార‌ని స‌మాచారం. బందిపోటు పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నుండ‌గా, మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ క‌నిపించ‌బోతున్నారు. నిధి అగ‌ర్వాల్, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

చిత్రంలో తండ్రీ – కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని, కొడుకు పాత్ర‌లో అకీరా అయితే బాగుంటుంద‌ని భావించిన క్రిష్‌.. అకీరాని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అకీరా క‌ర్ర‌సాము నేర్చుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంద‌నేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now