Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల ప్రేమకు గుర్తుగా జన్మించిన అకీరా నిత్యం ఏదో ఒక వార్తలో ఉంటున్నాడు. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇందుకు గల కారణం అకీరా తరచూ ఇప్పుడు పవన్ వెంట దర్శనం ఇవ్వడమే. పైగా తండ్రి పవన్ ని మించి పోయి 6ప్లస్ హైట్ తో సినీ హీరోని తలపిస్తున్నాడు. పబ్లిక్ లో కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అందుకే ఈ మెగా వారసుణ్ణి చూసి పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
2004 ఏప్రిల్ 8నా అకీరా పుడితే 2009లో పవన్ కళ్యాణ్ రేణు దేశాల వివాహం జరిగింది. 2010 మార్చి 23 ఈ జంటకు ఆధ్య జన్మించింది. ఆ తరువాత 2012లో పవన్, రేణు విడిపోవడం ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. పవన్ నుంచి వేరుపడిన వెంటనే అకీరా, ఆధ్యలను తీసుకుని పూణే వెళ్లి , మరాఠీ సినీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్థిరపడింది రేణు దేశాయ్.
పవన్ కళ్యాణ్ తో విడాకులు తర్వాత తన కొడుకు, కూతురు ప్రాణంగా బతుకుతోంది రేణు దేశాయ్. ఆ ఇద్దరికీ సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ వారి కెరీర్ కి మంచి బాటలు వేస్తోంది. అకీరా ప్రస్తుతం తను ఉన్నత చదవటం చదువు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఇక అసలు విషయానికొస్తే రేణు అకిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
పూణేలో అకీరాకు ఫ్రెండ్స్ తక్కువే. రేణు మేనల్లుడు తో అకీరా ఎక్కువ క్లోజ్ గా ఉంటాడు. ఓరోజు అతడి స్కూల్ పుస్తకంపై హీరోయిన్ శిల్ప శెట్టి ఫోటో ఉండడంతో తట్టుకోలేకపోయిన అకీరా వెంటనే తల్లికి కంప్లైంట్ చేసాడు. రేణు తన మేనల్లునితో కలిసి స్కూల్ కి వెళ్లి, ప్రిన్సిపాల్ తో చెప్పి పెద్ద క్లాస్ పీకిందట. నైతిక విలువల పట్ల నిబద్దత గల అకీరా చదువుకునే పుస్తకాలపై ఇలా హీరోయిన్స్ బొమ్మలు ఉండడం భరించలేకపోయాడు. ఇప్పటినుంచే సమాజం, విలువలు అంటూ తండ్రి పవన్ బాటలో పయనిస్తున్న అకీరా భవిష్యత్ లో సామాజిక ఉద్యమకారుడు అవుతాడని ఇంటర్వ్యూ ద్వారా రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…