Agent Movie : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మూవీ.. ఏజెంట్. ఈ మూవీని ఆగస్టు 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో అఖిల్ నభూతో నభవిష్యత్ అన్న రితీలో కనిపించాడు. ముఖ్యంగా అతని బాడీ, యాటిట్యూడ్, మ్యానరిజం పూర్తిగా మారిపోయాయి. పూర్తి మాస్ క్యారెక్టర్‌లో గూఢచారిగా అఖిల్ అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అవకముందే ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది.
అఖిల్ ఏజెంట్ మూవీకి గాను తాజాగా ఓ రికార్డు నమోదు అయింది. మిడ్ రేంజ్ మూవీలను పరిగణనలోకి తీసుకుంటే గతంలో నాని అంటే సుందరానికి మూవీ ట్రైలర్‌కి 24 గంట్లో 3.13 లక్షల లైక్స్ రాగా ఇప్పుడు దాన్ని ఏజెంట్ మూవీ బ్రేక్ చేసింది. కేవలం 6 గంటల్లోనే ఏజెంట్ ట్రైలర్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఇలా విడుదలక ముందే ఏజెంట్ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే అఖిల్ ఈ మూవీతో ఇంకో హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు.
అఖిల్ చివరిసారిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించగా.. ఈ మూవీ భారీ విజయం సాధించింది. అసలు అఖిల్‌కు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో హిట్‌ను సాధించాడు. ఇక ఇప్పుడు రీసెంట్‌గా విడుదలైన ఏజెంట్ ట్రైలర్‌ను చూస్తుంటే ఇంకో హిట్ పక్కా అని అక్కినేని అభిమానులు అంటున్నారు. మరి ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…