Akhanda Shyam Singha Roy : అఖండ‌, శ్యామ్ సింగ‌రాయ్ మూవీలు ఓటీటీలో ప్రసారం.. పూర్తి వివ‌రాలివే..!

January 20, 2022 8:21 PM

Akhanda Shyam Singha Roy : నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ మూవీ, నాని న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు ఈ మ‌ధ్య కాలంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. డిసెంబ‌ర్ నెల‌లో ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేశాయి. బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించాయి. అయితే ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు ఓటీటీలో ప్ర‌సారం అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

Akhanda Shyam Singha Roy movies to stream on otts know the details

శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం అర్థ‌రాత్రి 12 గంట‌ల త‌రువాత స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కృతి శెట్టి, సాయిప‌ల్ల‌వి ఫీమేల్ లీడ్స్‌లో న‌టించారు.

శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో నాని అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సాయిప‌ల్ల‌వి ఎప్ప‌టిలాగే త‌న‌దైన శైలిలో న‌టించి అల‌రించింది. ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు ఆమె పూర్తిగా న్యాయం చేసింది. నాని, సాయిప‌ల్ల‌విల మ‌ధ్య కెమిస్ట్రీ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక అఖండ చిత్రాన్ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల త‌రువాత స్ట్రీమ్ చేయ‌నున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. అఖండ మాస్ మ‌సాలా క‌మర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

అఖండ సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చింది. 2021 సంవ‌త్సరానికి అఖండ ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ 103 థియేట‌ర్ల‌లో 50 రోజులు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది.

కాగా ఈ రెండు మూవీలు ఈ వారాంతంలో ఓటీటీలో ప్ర‌సారం కానుండ‌డంతో ప్రేక్ష‌కులు మ‌రింత థ్రిల్ పొందుతార‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment