Akhanda Pre Release Event : సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ని శిల్పాకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను జరుపుకుంది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందం కూడా సందడి చేసింది. అయితే రాజమౌళి ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. బాలయ్యని ఆటమ్ బాంబ్ అని వర్ణించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
చిత్రంలోని మాస్ సాంగ్‌నని రివీల్ చేసిన రాజమౌళి అనంతరం మాట్లాడుతూ.. బాలయ్య ఎనర్జీ, బోయపాటి సీక్రెట్లపై కామెంట్ చేశాడు. బోయపాటి గారు థ్యాంక్స్. ఈ ఆడిటోరియంకే కాకుండా.. మొత్తం ఇండస్ట్రీకి ఊపును తీసుకొచ్చారు. డిసెంబర్ 2 నుంచి అన్ని థియేటర్లలో అందరికీ ఇంతే ఆనందం.. తెలుగు వాళ్లకు ఇంత ఆనందం రావాలి.. రావాలి కాదు.. వస్తుంది. కచ్చితంగా చెబుతున్నాను.
బాలయ్య బాబు ఆటమ్ బాంబ్.. దాన్ని ఎలా ప్రయోగించాలో బోయపాటి గారికి తెలుసు.. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి.. ఆయన ఆ సీక్రెట్ ఎలా చెబుతాడో.. మీరు కూడా మీ సీక్రెట్ చెప్పాలి. ఆ డ్యాన్స్ ఏంటి.. ఆ ఎనర్జీ ఏంటి.. ఇది కేవలం మచ్చుతునకే.. ఫస్ట్ డే ఫస్ట్ షో.. నో వేర్ ఎల్స్.. థియేటర్లో.. పెద్ద హిట్ అవ్వాలి.. ఇండస్ట్రీకి మంచి ఊపు రావాలి.. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చావ్.. నిర్మాతకు థ్యాంక్స్.. అని పేర్కొన్నారు రాజమౌళి. దర్శకధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…