Akhanda Pre Release Event : అది కేవ‌లం బాలయ్య‌కే సాధ్యం అని.. ప్ర‌శంస‌లు కురిపించిన బ‌న్నీ..

Akhanda Pre Release Event : అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన అల్లు అర్జున్ త‌న‌దైన మాట‌ల‌తో నంద‌మూరి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేశాడు. ‘నందమూరి అభిమానులకు, నా అభిమానులకు అందరికీ అభినందనలనీ అన్నారు. నందమూరి, అల్లు ఫ్యామిలీకు ఉన్న బంధం ఇప్పటిది కాదనీ, ఈ నాటి ఈ బంధం ఏనాటిదో.. అని చెప్పుకొచ్చారు. మా తాత గారు నేరుగా ఎన్టీఆర్ వంటింటికి వెళ్లేవారని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగామని, అలాంటి వారి సినిమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందనీ.. అన్నారు.

Akhanda Pre Release Event

బోయపాటితో నేను భద్ర సినిమా చేయాలి.. కానీ అప్పుడు ఆర్య సినిమా కోసం వెళ్లాను.. అప్పుడే బోయపాటి గారు పెద్ద దర్శకుడు అవుతారని నాకు నమ్మకం ఉందని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్.. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ఎదిగారన్న బన్నీ, మీ జర్నీ చూశాను.. మనతో స్టార్ట్ అయిన వ్యక్తి ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. తమన్ మామూలు ఫాంలో లేడు.. పట్టుకుందల్లా బంగారం.. కొట్టిందల్లా సిక్సర్ అవుతోంది అని బన్నీ చెప్పుకొచ్చారు. ఇకపై కొత్త శ్రీకాంత్‌ను చూడాలని కోరుకుంటున్నానని బన్నీ అన్నారు.

ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ బాలకృష్ణ గారికి ఈ లెవెల్లో ఫ్యాన్స్ బేస్ ఉండటానికి రెండు కారణాలు. ఒకటి.. ఆయనకు సినిమా మీదున్న ప్యాషన్. రెండోది ఆయన వాచకం.. ఆయనలా డైలాగ్ చెప్పేవారు ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు. రెండు మూడు పెజీల డైలాగ్స్ చెప్పినా అదే ఇంటెన్సిటీ ఉంటుందనీ, ఈ డిక్షన్ అనేది మహానుభావులు ఎన్టీఆర్ గారి వల్లే కుదిరింది. ఆ తరువాత కేవలం బాలయ్య గారే చెప్పగలరన్నారు. రీల్‌లో అయినా రియల్‌లో అయినా.. ఆయన రియల్‌గానే ఉంటారు. కోపం వస్తే కోపం.. ప్రేమ వస్తే ప్రేమ.. ఎప్పుడూ రియల్‌గానే ఉంటారని అన్నారు. మనం అనుకున్నది చేయగలగడం, అనుకున్నట్టు ఉండటం చాలా కష్టం, కానీ బాలయ్య గారు అలా ఉంటారు. నాకు పర్సనల్‌గా ఆయనలో ఇష్టమైంది అదేనని అన్నారు.

అఖండ సినిమా అఖండ జ్యోతిలా తెలుగు సినిమాకు వెలుగునివ్వాలని అందరం కోరుకుటున్నామన్న బన్నీ ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతున్న పుష్ప, ఆ తరువాత రాబోతున్న ఆర్ఆర్ఆర్.. అలా ముందుకు వెళ్లాలి.. ఇండస్ట్రీ గెలవాలని ఆకాంక్షించారు. ఇక కోవిడ్ వచ్చినా.. పైనుంచి దేవుడు వచ్చినా.. తెలుగు ప్రేక్షకులు.. సినిమా తగ్గేదేలే.. మీ అందరి కోసం జై బాలయ్య.. అంటూ ఉత్సాహ‌ప‌రిచారు బ‌న్నీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM