Akhanda Movie : బాలకృష్ణ చాలా రోజుల తరువాత మళ్లీ అఖండతో చక్కని హిట్ కొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే హిట్ చిత్రాలకు పెట్టింది పేరు. వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కాగా.. ఇది కూడా విజయం సాధించింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ ఇందులో డిఫరెంట్ గెటప్‌లో కనిపించే సరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇందులో బాలకృష్ణ మాస్ జాతర సృష్టించారని అంటున్నారు. అఘోరగా అద్భుతంగా నటించారని కితాబిస్తున్నారు.
ఇక అఖండ మూవీకి గాను ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. దీంతో 40 రోజుల అనంతరం ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో భారీ మొత్తమే చెల్లించి హాట్ స్టార్ వారు అఖండ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…