Akhanda Movie : ఓటీటీలో బాల‌కృష్ణ అఖండ మూవీ.. హ‌క్కులు వారికే..!

December 4, 2021 6:52 PM

Akhanda Movie : బాలకృష్ణ చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ అఖండ‌తో చ‌క్క‌ని హిట్ కొట్టారు. బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. మూవీ ప్ర‌స్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Akhanda Movie ott rights got by disney plus hotstar

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే హిట్ చిత్రాల‌కు పెట్టింది పేరు. వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కాగా.. ఇది కూడా విజ‌యం సాధించింది. డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ విడుద‌లైన అన్ని చోట్లా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. బాల‌కృష్ణ ఇందులో డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. ఇందులో బాల‌కృష్ణ మాస్ జాత‌ర సృష్టించార‌ని అంటున్నారు. అఘోర‌గా అద్భుతంగా న‌టించార‌ని కితాబిస్తున్నారు.

ఇక అఖండ మూవీకి గాను ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. దీంతో 40 రోజుల అనంత‌రం ఈ మూవీ అందులో స్ట్రీమింగ్ అవుతుంద‌ని స‌మాచారం. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో భారీ మొత్త‌మే చెల్లించి హాట్ స్టార్ వారు అఖండ ఓటీటీ రైట్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మూవీలో బాల‌కృష్ణ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now