Akhanda Movie : సక్సెస్ బాట‌లో అఖండ‌.. ఇంకా ఎన్ని కోట్లు వ‌సూలు చేయాలంటే..?

December 3, 2021 3:31 PM

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ మొత్తంలో జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్ర‌మే రూ.50 కోట్లు వ‌సూలు చేయగా ఈ సినిమా పూర్తి విజయం సాధించాలంటే ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో కలెక్షన్ల‌ను రాబట్టాల్సి ఉంటుంది.

Akhanda Movie must collect these amount to be in successful position

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ఉంది అనే విషయానికి వస్తే.. నైజాం : రూ.10.5 కోట్లు, సీడెడ్ : రూ.10.6 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ.6 కోట్లు, తూర్పు గోదావరి : రూ. 4 కోట్లు, పశ్చిమ గోదావరి : రూ.3.5 కోట్లు, గుంటూరు : రూ.5.4 కోట్లు, కృష్ణా : రూ.3.7 కోట్లు, నెల్లూరు : రూ.1.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం : రూ.45.5 కోట్లు, కర్ణాటక+భారతదేశంలో : రూ.5 కోట్లు, ఓవర్సీస్ : రూ.2.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కన్నా మరికొంత కలెక్షన్లను సాధించాల్సి ఉంటుంది.

కరోనా రెండవ దశ తరువాత ఇంత పెద్దమొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొట్టమొదటి సినిమాగా అఖండ సినిమా నిలుస్తోంది. ఇక ఈ సినిమా విజయం సాధించాలంటే సుమారుగా రూ.60 కోట్ల కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాక్ చూస్తుంటే ఈ సినిమా ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్లనే రాబడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment