Aha : సమంత, బాలకృష్ణలను నమ్మి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ఆ సంస్థ.. ఫలితం దక్కేనా ?

October 20, 2021 7:51 PM

Aha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమంత కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్ లో రాజీ అనే పాత్రలో నటించిన సమంతకు మొదట్లో అభినందనలు వచ్చినా ఆ తర్వాత ఈమె పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి.

Aha OTT platform spending huge money for samantha and balakrishna can they get profits

ఈ సిరీస్ తర్వాత సమంతకు ఎన్నో వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిని రిజెక్ట్ చేసిన సమంత తాజాగా వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంతతో వెబ్ సిరీస్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందుకు రావాలనే ఆలోచనలో ఉండగానే.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. సమంతతో వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్‌ చేస్తోంది.

ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి సమంతకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇది వరకు సమంత ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఇక ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కోసం బాలయ్యకు రూ.కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరినీ నమ్ముకొని ఆహా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. మరి వీటి ఫలితం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment