Adipurush : రాముడిగా ప్ర‌భాస్‌.. ఆదిపురుష్ లోని సీన్‌ లీక్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

January 31, 2022 12:51 PM

Adipurush : ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో.. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కుతున్న చిత్రం.. ఆదిపురుష్‌. ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సీత‌గా కృతి స‌న‌న్‌, విల‌న్‌గా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి చెందిన వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

Adipurush scene reportedly leaked online fans are crazy
Prabhas in Adipurush

ఆది పురుష్ సినిమాకు గాను ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. ఇందులో గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేశారు. ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ ద‌గ్గ‌రుండి గ్రాఫిక్స్ ప‌నులు చూసుకుంటున్నారు. తానాజీ సినిమాలో తీసిన విధంగానే ఆది పురుష్‌ను కూడా పూర్తిగా ఇండోర్స్‌లోనే గ్రీన్ మ్యాట్ పై చిత్రీక‌రించారు. దీంతో ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. సినిమాలో చాలా వ‌ర‌కు గ్రాఫిక్స్ ఉండ‌నున్నాయి.

Adipurush : ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు..

కాగా ఆదిపురుష్ సినిమాలోని ఓ సీన్ లీకైంది. అయితే అది ఒరిజిన‌ల్ సినిమాలోదా.. లేక ఎవ‌రైనా సృష్టించి వ‌దిలారా.. అన్న‌ది సంగ‌తి తెలియ‌దు. కానీ ఫ్యాన్స్ దాన్ని వైర‌ల్ చేస్తున్నారు. అస‌లే రాధే శ్యామ్ సినిమా వాయిదా ప‌డ‌డంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఈ వార్త వారికి సంతోషాన్నిస్తోంది. అది ఫ్యాన్ మేడ్ లేదా లీకైన వీడియో.. ఏదైనా కావ‌చ్చు.. ఏదో ఒక అప్‌డేట్ అయితే వ‌చ్చింద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

ఆదిపురుష్ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ క‌థ యూనివ‌ర్స‌ల్ క‌నుక‌.. రాముడు అంటే ప్ర‌పంచంలో చాలా మంది తెలుసు క‌నుక‌.. ఈ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్ర‌భాస్ అంత‌ర్జాతీయ స్టార్‌గా మారుతాడ‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now