Actress Raasi : సీనియ‌ర్ హీరోయిన్ రాశి భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన‌వాడ‌న్న విష‌యం తెలుసా..?

February 2, 2023 6:24 PM

Actress Raasi : 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ప్ర‌శంస‌లు పొందిన‌ రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు,తమిళ్,హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ.. మమతల కోవెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాశీ హీరోయిన్ గా చేయడానికి చాలా సమయమే తీసుకుంది.. అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె చరిత్ర సృష్టించగా స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది.. అప్పట్లో రాశి నటనకు ప్రేక్షకులు ఎంత‌గానో మంత్రముగ్ధులయ్యేవారు.

అయితే రాశి సడన్ గా పెళ్లి చేసుకొని చాలాకాలం పాటు అటు సినిమాలకు,ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రాశి పెళ్లిలో అనేక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. రాశికి వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళ సంబంధాలు వచ్చాయి. కాని వాటన్నిటినీ తిరస్కరించిన రాశి ఒక సహాయక దర్శకుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఎంతో మంది కోటీశ్వరులు, బిజినెస్ మెన్ లు వెంటపడ్డ ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతని పేరు ఎస్ఎస్ నివాస్. అత‌ను రాశీ చేసిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

Actress Raasi family interesting facts
Actress Raasi

2005లో వీరి పెళ్లి జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం రాశి స‌హాయ‌క పాత్ర‌ల‌లో న‌టిస్తుంది. సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో తెగ సంద‌డి చేస్తుంది. కాగా, రాశి- శ్రీకాంత్ కాంబో వ‌చ్చిన‌ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దశాబ్దం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన రాశీ టాప్ హీరోయిన్ లకు మంచి పోటీ ఇచ్చింది. అయితే కాలక్రమేణా ఆమె తన ప్రాభల్యం కోల్పోయింది.. హీరోయిన్ గా సినిమాలు మానేసిన తర్వాత ఆమె రీ ఎంట్రీ కోసం అందరు వెయిట్ చేశారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ అంతగా ప్రభావం చూపించ‌లేక‌పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment