Actress Hema : నటి హేమ అంటే అందరికీ సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. హేమ బిగ్ బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. కొన్ని రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమె నటిగానే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాజాగా హేమ మరో నటి సురేఖ వాణిని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేసింది.
సురేఖ కూతురు సుప్రీత.. తన కూతురు ఈషా మంచి ఫ్రెండ్స్ కాగా ఆమె వాళ్ళను విడగొట్టిందని, తన గురించి వేరే వాళ్లకు తప్పుగా చెప్పేవారని ఆమె ఆరోపించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖను ఉద్దేశిస్తూ హేమ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ హేమ ఏమన్నదంటే.. సురేఖవాణి, నేను బెస్ట్ ఫ్రెండ్స్. మాలాగే మా అమ్మాయిలు కూడా మంచి స్నేహితులు. అయితే సురేఖ వాళ్ళను విడగొట్టాలని చూసింది. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుతుండగా సుప్రీతను వేరే స్కూల్ లో చేర్చింది. అయినా సుప్రీత.. నా కూతురు ఈషా ఉన్న స్కూల్ కే తిరిగి వచ్చేసింది.
సుప్రీత కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఆ కారణంతోనే నా కూతురు ఈషాకు ఆమెను దూరం చేయాలని సురేఖ ప్రయత్నం చేసింది. అంతే కాకుండా షూటింగ్స్ సెట్స్ లో సురేఖ వేరే వాళ్ళకి నా గురించి తప్పుగా చెప్పింది. ఇవన్నీ తెలిశాక ఆమెను కలవడం మానేశాను. నేను సురేఖకు దూరంగా ఉంటున్నాను.. అని హేమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సురేఖపై హేమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరి హేమ ఆరోపణలకు సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి. సురేఖా వాణి తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. మూడేళ్ళ క్రితం సురేఖ వాణి భర్త అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి ఆమె కూతురు సుప్రీతతో ఒంటరిగా ఉంటోంది. సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సుప్రీతను హీరోయిన్ ను చేయాలనేది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…