Bimbisara : బింబిసార చిత్ర క‌థ‌ను రిజెక్ట్ చేసిన న‌లుగురు హీరోలు.. ఎవ‌రో తెలుసా..?

Bimbisara : 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో క‌ల్యాణ్ రామ్ హిట్‌ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైన బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలైన బింబిసార చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో పయనిస్తోంది.

ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా యువ దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించారు. ఒక పవర్ ఫుల్ కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వశిష్ట సక్సెస్ ను సాధించారని చెప్పవచ్చు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన పరంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.

Bimbisara

ప్రముఖ టాలీవుడ్ హీరోలు సైతం కళ్యాణ్ రామ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. అయితే వశిష్ట ఈ చిత్ర కథను కళ్యాణ్ రామ్ కంటే ముందు నలుగురు హీరోలకు చెప్పాడ‌ట‌. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరంటే..

మొదటగా వశిష్ట ఈ చిత్ర కథను నితిన్ తో చర్చలు జర‌పగా నితిన్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని సంప్రదించగా ఇలాంటి కథ తనకు సెట్ కాదని నో చెప్పేశాడట. ఆ తరవాత అల్లు శిరీష్, రాజ్ తరుణ్ వంటి వారితో కూడా కథ గురించి చర్చలు జరపగా వారు కూడా బింబిసారలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. చివరికి ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ని వరించింది.

ఒకవేళ ఈ నలుగురిలో ఏ ఒక్కరు బింబిసార చిత్రంలో హీరోగా నటించినా క‌చ్చితంగా సక్సెస్ అయ్యి ఉండేదికాదు. కళ్యాణ్ రామ్ మాత్రమే బింబిసార చిత్రానికి అత్యద్భుతంగా సెట్ అయ్యాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అదరహో అనిపించే విధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM