Actress Archana : అప్పుడు నో చెప్పి త‌ప్పు చేశా.. న‌టి అర్చ‌న ఎమోష‌న‌ల్‌..!

June 29, 2022 6:35 PM

Actress Archana : కెరీర్ ఆరంభంలో వేద‌గా ప‌రిచ‌యం అయి.. త‌రువాత అర్చ‌న‌గా పేరు మార్చుకుని తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొంది ఆమె. ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన అర్చ‌న చ‌క్క‌ని న‌టి మాత్ర‌మే కాదు.. మంచి డ్యాన్స‌ర్ కూడా. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటోంది. వివాహం అయ్యాక సినిమాల‌కు దాదాపుగా దూరం అయ్యింద‌నే చెప్ప‌వ‌చ్చు. భ‌ర్త‌తో క‌ల‌సి ఈమె ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తోంది. అయితే ఈమె తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో త‌న జీవితానికి చెందిన ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేసింది. ఈ సంద‌ర్బంగా అర్చ‌న ఎమోష‌న‌ల్ కూడా అయింది.

అలీతో స‌ర‌దాగా అనే కార్య‌క్ర‌మంలో భ‌ర్త జ‌గ‌దీష్‌తో క‌లిసి ప‌లు విశేషాల‌ను న‌టి అర్చ‌న పంచుకుంది. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీ‌రామ‌దాసు సినిమా చేస్తున్న‌ప్పుడు త‌న వ‌య‌స్సు చాలా త‌క్కువ అని.. సుమ‌న్ రాముడిగా న‌టించార‌ని.. ఆయ‌న ప‌క్క‌న తాను సీతాదేవిగా చేశాన‌ని.. అయితే ఈ క్రెడిట్ మొత్తం కె.రాఘ‌వేంద‌ర్ రావుదే అని అర్చ‌న తెలిపారు. ఆ త‌రువాత త‌న‌కు మ‌ళ్లీ సినిమాలో అవ‌కాశం ఎప్పుడు ఇస్తారు ? అని ఆయ‌ను అడిగాన‌ని అర్చ‌న తెలిపారు.

Actress Archana got emotional for rejecteing movie offer
Actress Archana

ఇక బాల‌కృష్ణ‌కు గోపిక‌ల‌తో డ్యాన్స్ చేయ‌డాన్ని తానే నేర్పించాన‌ని.. ఇందుకు ఆయ‌న త‌ను ప్ర‌శంసించార‌ని అర్చ‌న తెలియ‌జేసింది. అలాగే రాజ‌మౌళి తీసిన సినిమాల్లోనూ న‌టించాన‌ని.. య‌మ‌దొంగలో ఓ సాంగ్‌లో చేయ‌గా.. మ‌గ‌ధీర‌లో మాత్రం ఒక క్యారెక్ట‌ర్‌కు ఆయ‌న అడిగితే నో చెప్పాన‌ని.. అది తాను జీవితంలో చేసిన పెద్ద త‌ప్పు అని అన్నారు. ఆ సినిమాలో నటించి ఉంటే త‌న గ్రాఫ్ ఇంకోలా ఉండేద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లో ప్ర‌సారం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment