Movies : అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ సినిమాలను కృష్ణ తీశారు.
అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో కృష్ణ చేరారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతూ పలు మూవీలను తీశారు. సింహాసనం, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం వంటి సినిమాలను తీశారు.
ఎన్టీఆర్ తరచూ వాడే కొన్ని ఊతపదాలను యథాతధంగా వాడుతూ తీసిన ఈ సినిమాల్లో సింహాసనం మూవీకి కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. కొన్ని సినిమాలను విజయనిర్మల డైరెక్ట్ చేశారు. అయితే మండలాధీశుడు వంటి సినిమాల్లో కృష్ణ గెస్ట్ గా చేసి.. వేరే వాళ్లతో నటింపజేసి కృష్ణ స్వయంగా సినిమా తీయడం మరో విశేషం. ఇలా పలు మూవీలను కృష్ణ అప్పట్లో ఎన్‌టీఆర్‌కు వ్యతిరేకంగా తీశారు. అయితే అప్పట్లో కృష్ణ కాంగ్రెస్‌లో చేరినందువల్లే.. ఆయన ఎన్‌టీఆర్‌కు బద్ద శత్రువు అయ్యారని చెబుతారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…