Movies : ఎన్‌టీఆర్‌కి వ్య‌తిరేకంగా.. కృష్ణ తీసిన సినిమాలు ఇవే..!

October 4, 2022 10:02 PM

Movies : అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ సినిమాల‌ను కృష్ణ తీశారు.

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో కృష్ణ చేరారు. అనంత‌రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతూ ప‌లు మూవీల‌ను తీశారు. సింహాసనం, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం వంటి సినిమాల‌ను తీశారు.

Actor Krishna made these movies opposite to Sr NTR
Movies

ఎన్టీఆర్ తరచూ వాడే కొన్ని ఊతపదాలను యథాతధంగా వాడుతూ తీసిన ఈ సినిమాల్లో సింహాసనం మూవీకి కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. కొన్ని సినిమాల‌ను విజయనిర్మల డైరెక్ట్ చేశారు. అయితే మండలాధీశుడు వంటి సినిమాల్లో కృష్ణ గెస్ట్ గా చేసి.. వేరే వాళ్లతో నటింపజేసి కృష్ణ స్వయంగా సినిమా తీయడం మరో విశేషం. ఇలా ప‌లు మూవీల‌ను కృష్ణ అప్ప‌ట్లో ఎన్‌టీఆర్‌కు వ్య‌తిరేకంగా తీశారు. అయితే అప్ప‌ట్లో కృష్ణ కాంగ్రెస్‌లో చేరినందువ‌ల్లే.. ఆయ‌న ఎన్‌టీఆర్‌కు బ‌ద్ద శ‌త్రువు అయ్యార‌ని చెబుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now