Acharya Movie : కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం.. ఆచార్య.. అభిమానుల భారీ అంచనాల నడుమ ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ ఇంకో కీలకపాత్రను పోషించారు. అయితే ఈ మూవీకి గత నాలుగైదు రోజుల నుంచి నెగెటివ్ టాక్ ఎక్కువగా వస్తోంది. అయితే సినిమా విడుదలయ్యాక అది నిజమే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఆచార్య మూవీకి, కొరటాల శివ తెరకెక్కించిన మహేష్ బాబు మూవీ శ్రీమంతుడికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. దీంతో ఆచార్య సినిమాను చిరంజీవికి చెందిన శ్రీమంతుడు వెర్షన్ అని అంటున్నారు. ఇక రెండింటినీ ఒకసారి పరిశీలిస్తే..
శ్రీమంతుడు సినిమాలో హీరో పాత్ర ఒక పల్లెటూరుకు చెందుతుంది. హీరో తండ్రికి ఆ ఊరితో అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ ఒక మాట అనేసరికి పుట్టిన ఊరును బాగు చేసేందుకు హీరో అక్కడికి వెళ్తాడు. అయితే అప్పటికే గ్రామస్థులు అందరూ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోతుంటారు. కానీ వారికి హీరో ధైర్యం చెప్పి అక్కడ అభివృద్ధి పనులు చేస్తాడు. ఆ ఊరిని మారుస్తాడు. అక్కడి సమస్యలను పరిష్కిస్తాడు.
ఇక ఆచార్యలో ధర్మస్థలి అనే గ్రామం ఉంటుంది. దాన్ని కార్పొరేట్ శక్తులు దక్కించుకోవాలని చూస్తుంటాయి. సరిగ్గా ఆచార్య కూడా అక్కడికి చేరుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపుతాడు. తరువాత వారి సమస్యలను పరిష్కరిస్తాడు. ఇలా శ్రీమంతుడు, ఆచార్య సినిమాలు.. రెండింటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అయితే శ్రీమంతుడు వచ్చినప్పుడు అది కొత్త కథ. ఊరిని దత్తత తీసుకోవడం అన్న కాన్సెప్ట్ ఆకట్టుకుంది. అందుకనే ఆ మూవీ హిట్ అయింది. కానీ ఇప్పుడు ఆచార్యలోనూ సరిగ్గా అదే కథను చూపించారు. అయితే కథనం చాలా నెమ్మదిగా సాగడం, పాత్రల చిత్రీకరణ చాలా బలహీనంగా ఉండడం, చిరంజీవి, రామ్ చరణ్‌లను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం.. వంటి అంశాల కారణంగా ఆచార్య ఫ్లాప్ అయింది. అలాగే సినిమాలోని పాత్రలకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ అవసరమే లేదని.. చిరు, చరణ్‌లను సాధారణంగా చూపించి ఉంటే బాగుండేదని.. అలాగే చిరంజీవి యవ్వనంలో ఉన్నప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపించడం అసలే నచ్చలేదని.. అంటున్నారు. ఇవన్నీ సినిమా ఫ్లాప్ అవడం వెనుక ఉన్న కారణాలుగా పేర్కొంటున్నారు. అయితే ఎన్‌టీఆర్‌తో త్వరలో కొరటాల ఓ మూవీని చేయనున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…