Acharya Movie : మ‌హేష్ బాబు న‌టించిన ఆ సినిమానే.. చిరంజీవి ఆచార్య‌గా తీశారా..?

April 30, 2022 11:54 AM

Acharya Movie : కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం.. ఆచార్య‌.. అభిమానుల భారీ అంచ‌నాల న‌డుమ ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఇంకో కీల‌క‌పాత్ర‌ను పోషించారు. అయితే ఈ మూవీకి గ‌త నాలుగైదు రోజుల నుంచి నెగెటివ్ టాక్ ఎక్కువ‌గా వ‌స్తోంది. అయితే సినిమా విడుద‌ల‌య్యాక అది నిజ‌మే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని త‌న ఖాతాలో వేసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే వాస్త‌వానికి ఆచార్య మూవీకి, కొర‌టాల శివ తెర‌కెక్కించిన మ‌హేష్ బాబు మూవీ శ్రీ‌మంతుడికి చాలా ద‌గ్గ‌రి పోలిక‌లు ఉన్నాయి. దీంతో ఆచార్య సినిమాను చిరంజీవికి చెందిన శ్రీ‌మంతుడు వెర్ష‌న్ అని అంటున్నారు. ఇక రెండింటినీ ఒక‌సారి ప‌రిశీలిస్తే..

Acharya Movie story may be copied from Mahesh Babu movie
Acharya Movie

శ్రీ‌మంతుడు సినిమాలో హీరో పాత్ర ఒక ప‌ల్లెటూరుకు చెందుతుంది. హీరో తండ్రికి ఆ ఊరితో అనుబంధం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ ఒక మాట అనేసరికి పుట్టిన ఊరును బాగు చేసేందుకు హీరో అక్క‌డికి వెళ్తాడు. అయితే అప్ప‌టికే గ్రామ‌స్థులు అంద‌రూ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోతుంటారు. కానీ వారికి హీరో ధైర్యం చెప్పి అక్క‌డ అభివృద్ధి ప‌నులు చేస్తాడు. ఆ ఊరిని మారుస్తాడు. అక్క‌డి స‌మ‌స్య‌లను ప‌రిష్కిస్తాడు.

ఇక ఆచార్య‌లో ధ‌ర్మ‌స్థ‌లి అనే గ్రామం ఉంటుంది. దాన్ని కార్పొరేట్ శ‌క్తులు ద‌క్కించుకోవాల‌ని చూస్తుంటాయి. స‌రిగ్గా ఆచార్య కూడా అక్క‌డికి చేరుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపుతాడు. త‌రువాత వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాడు. ఇలా శ్రీ‌మంతుడు, ఆచార్య సినిమాలు.. రెండింటికీ చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి. అయితే శ్రీ‌మంతుడు వ‌చ్చినప్పుడు అది కొత్త క‌థ‌. ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం అన్న కాన్సెప్ట్ ఆక‌ట్టుకుంది. అందుక‌నే ఆ మూవీ హిట్ అయింది. కానీ ఇప్పుడు ఆచార్య‌లోనూ స‌రిగ్గా అదే క‌థను చూపించారు. అయితే క‌థ‌నం చాలా నెమ్మ‌దిగా సాగ‌డం, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ చాలా బ‌ల‌హీనంగా ఉండ‌డం, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోక‌పోవ‌డం.. వంటి అంశాల కార‌ణంగా ఆచార్య ఫ్లాప్ అయింది. అలాగే సినిమాలోని పాత్ర‌ల‌కు న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ అవ‌స‌ర‌మే లేద‌ని.. చిరు, చర‌ణ్‌ల‌ను సాధార‌ణంగా చూపించి ఉంటే బాగుండేద‌ని.. అలాగే చిరంజీవి య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపించ‌డం అస‌లే న‌చ్చ‌లేద‌ని.. అంటున్నారు. ఇవ‌న్నీ సినిమా ఫ్లాప్ అవడం వెనుక ఉన్న కార‌ణాలుగా పేర్కొంటున్నారు. అయితే ఎన్‌టీఆర్‌తో త్వ‌ర‌లో కొరటాల ఓ మూవీని చేయ‌నున్నారు. మ‌రి అది ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now