Acharya Movie : ఫైన‌ల్‌గా ఆచార్య నుండి బిగ్ అప్‌డేట్.. ఇక అభిమానుల‌కి పూన‌కాలే..!

November 24, 2021 5:31 PM

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య‌. ఈ సినిమా గ‌త మూడేళ్ల నుండి షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

Acharya Movie ram charan look update fans are happy

‘ఆచార్య’ సినిమాలో సిద్ధ సాగా క్యారెక్టర్ టీజర్ ని నవంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ధర్మమే సిద్ధ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్ గెటప్ లో చేతిలో తుపాకీ పట్టుకొని ఆవేశంగా చూస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మెగాస్టార్ ఇంటెన్స్‌లుక్ ఆక‌ట్టుకుంటోంది.

సిద్ధ అనేక కారణాల వల్ల నాకు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. పవర్ ఫుల్ టీజర్ రాబోతుంది.. అని చరణ్ పేర్కొన్నారు. సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా ‘ఆచార్య’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఇందులో దేవాదాయ భూముల కుంభకోణం గురించి ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది.

చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెజీనా కసండ్రా, సంగీత ప్రత్యేక గీతాల్లో కనిపిస్తుండగా.. సోనూసూద్, జిషు షేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు .2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now