Acharya Movie On OTT : మెగా అభిమానుల‌కి గుడ్ న్యూస్.. ఓటీటీలో ఆచార్య‌.. ఎందులో అంటే..?

April 29, 2022 5:36 PM

Acharya Movie On OTT : భారీ అంచ‌నాల న‌డుమ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ఆచార్య‌. దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత చిరంజీవి ఆచార్య‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. భారీ అంచ‌నాలు న‌డుమ నేడు థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. మూవీకి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తున్న‌ నేప‌థ్యంలో చాలా మంది మెగా అభిమానులు నీర‌సించిపోయారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Acharya Movie On OTT know which platform will stream it
Acharya Movie On OTT

సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ఆచార్య మూవీ తొలి వారం హౌజ్‌ఫుల్‌తో దూసుకుపోతుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. ఇక ఇటీవ‌లి కాలంలో సినిమాలు విడులైన కొద్ది రోజుల‌కే ఓటీటీలోకి వ‌స్తుండ‌గా, ఆచార్య మూవీ కూడా త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం.

అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్‌ చరణ్‌ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డె నటించింది. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ ని ఎంపిక చేసి ఆ త‌ర్వాత త‌ప్పించారు. ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్‌ సెట్‌ వేసిన విషయం తెలిసిందే. దానికి ధర్మస్థలి అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్‌ చేశారు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ సినిమాకి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment