Acharya Movie : 42 శాతం ట్యాక్స్ క‌డుతున్నాం.. టిక్కెట్ల ధ‌ర‌లు పెంచితే త‌ప్పేముంది : చిరంజీవి

April 27, 2022 1:22 PM

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య చిత్ర ప్రమోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న చిత్రం విడుద‌ల కానుండ‌గా.. ఈ సినిమాకి వీలైనంత ప్ర‌చారం ద‌క్కేలా చేస్తున్నారు. అంతేకాక మీడియా ఇంట‌రాక్ష‌న్ లో అనేక విష‌యాల గురించి చెప్పుకొస్తున్నారు. తాజాగా ఓ పాత్రికేయుడు.. చిరంజీవి సినిమా అంటేనే అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ఆచార్యకి టికెట్ రేటు పెంచవలసిన అవసరం ఉందా ? అని అడిగారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందుల్లో పడింది.

Acharya Movie it is ok to hike cinema ticket rates says Chiranjeevi
Acharya Movie

వడ్డీగా రూ.50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా ? ఎవరిస్తారు చెప్పండి ?. మేము ప్ర‌భుత్వాల‌కు 42 శాతం ప‌న్ను క‌డుతున్నాం.. అని అన్నారు. ఈ క్ర‌మంలో టికెట్ ధ‌ర‌లు పెంచ‌మ‌ని ప్ర‌భుత్వాల‌ను వేడుకుంటే త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు అని చిరంజీవి అన్నారు.

కాగా ఈ నెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు సైతం వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. ఇక ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించడమనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. నటుడిగా రామ్‌చరణ్ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోయే స్థితిని చూడడం తండ్రిగా గొప్ప అనుభూతి. రామ్‌చరణ్ తన కెరీర్‌ను మలుచుకొనే తీరు అద్బుతంగా ఉంది.. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now