lifestyle

Intermittent Fasting : ఉప‌వాసం ఇలా చేయండి.. దెబ్బ‌కు బ‌రువు ఇట్టే త‌గ్గిపోతారు..!

Intermittent Fasting : ఉప‌వాసం.. దీన్నే ఇంగ్లిష్‌లో ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే ఫాస్టింగ్ అనేది వారంలో ఒకటి లేదా రెండు రోజులు చేస్తారు. దీంతో ఆ రోజు మొత్తం ఏమీ తిన‌కుండా ఉంటారు. అయితే అలా కాకుండా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయ‌వ‌చ్చు. దీంతోనూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. తినే తిండిని ఆపి ఫాస్టింగ్ ఉండ‌డం అన్న‌మాట‌. దీన్ని అనేక ర‌కాలుగా చేయ‌వ‌చ్చు. అంటే.. రోజు మొత్తంలో కేవ‌లం 8 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకోవాల‌న్న‌మాట‌. మిగిలిన 16 గంట‌లు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. కేవ‌లం నీరు మాత్ర‌మే తాగ‌వ‌చ్చు.

Intermittent Fasting

ఆ 8 గంట‌ల స‌మ‌యంలో మీకు న‌చ్చిన‌, మీకు ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని తిన‌వ‌చ్చు. ఇక ఆ 8 గంట‌లను మీరు రోజులో ఎప్పుడైనా పాటించ‌వ‌చ్చు. అంటే.. ఉద‌యం 8 గంట‌ల‌కు తిన‌డం ప్రారంభించార‌నుకుంటే.. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కే తినాలి. ఆ త‌రువాత ఏమీ తిన‌రాదు. మ‌ళ్లీ మ‌రుస‌టి రోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు ఫాస్టింగ్ ఉండాలి. దీన్నే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.

అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 8 గంట‌లు మాత్ర‌మే తినాల‌ని ఏమీ లేదు. కొంద‌రు దీన్ని 6, 4 గంట‌లు పాటిస్తారు. అంటే.. 24 గంట‌ల్లో 6 లేదా 4 గంట‌ల పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుంటార‌న్న‌మాట. మిగిలిన 18 లేదా 20 గంట‌ల పాటు ఏమీ తిన‌ర‌న్న‌మాట‌. ఇలా కూడా కొంద‌రు చేస్తారు. దీన్ని కూడా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే అంటారు. అయితే పైన చెప్పిన మూడు ప‌ద్ధ‌తుల్లో ఏ రక‌మైన ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా స‌రే.. కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే..

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈ ఫాస్టింగ్ వ‌ల్ల అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌డంతోపాటు త‌గ్గిన బ‌రువును నియంత్ర‌ణ‌లో కూడా ఉంచుకోవ‌చ్చ‌ట‌. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ రాకుండా ఉంటాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM