ఆధ్యాత్మికం

Kanipakam Temple Facts : కాణిపాకం ఆల‌యానికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Kanipakam Temple Facts : మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తిరుమ‌ల‌కు ఎంతో పేరు ఉంది. అక్క‌డ కొలువై ఉన్న వెంక‌టేశ్వ‌రున్ని పూజిస్తే స‌క‌ల దోషాలు పోతాయ‌ని, అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని, కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే తిరుప‌తికి వెళ్లే చాలా మంది ద‌ర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒక‌టి. తిరుమ‌ల వెంక‌న్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయ‌కుడికి కూడా అంతే పేరుంది. ఈ క్ర‌మంలోనే కాణిపాక ఆల‌య విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాణిపాకంలో వినాయ‌కున్ని ఎవ‌రూ ప్ర‌తిష్టించ‌లేదు. ఆయన ఇక్క‌డ స్వ‌యంభువుగా వెలిశాడ‌ని చ‌రిత్ర చెబుతోంది. అందులో భాగంగానే ఓ క‌థ కూడా ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది.. అదేమిటంటే.. ఒక‌ప్పుడు ఒక గ్రామంలో మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి వ్య‌వ‌సాయ భూమిలో ఎప్పుడూ పంట‌లు బాగా పండేవి. అయితే ఒక‌సారి వారి వ్య‌వ‌సాయ భూమిలో ఉండే బావిలో నీరు ఎండిపోతుండ‌డాన్ని వారు గ‌మ‌నించారు. దీంతో వారు ఆ బావిని కొంత తవ్వితే నీరు వ‌స్తుంద‌ని భావించి వెంట‌నే ఆ బావిని తవ్వ‌డం మొద‌లు పెట్టారు. అలా వారు కొంత త‌వ్వ‌గానే ఓ రాయి త‌గిలింది. దీంతో ఆ బావినిండా ర‌క్తం ఊరుతుంది. క్ర‌మ క్ర‌మంగా ఆ బావి ర‌క్తంతో నిండుతుంటుంది. అయితే అదే స‌మ‌యంలో వారికి బావిలో వినాయ‌కుడి విగ్ర‌హం కనిపిస్తుంది. దీంతో వారు త‌వ్వ‌డం ఆపి విగ్ర‌హాన్ని పూజిస్తారు. ఈ క్ర‌మంలో వెంట‌నే వారికి ఉన్న వైక‌ల్యాలు పోయి వారు మామూలు మ‌నుషులుగా మారుతారు.

Kanipakam Temple Facts

అలా ఆ విష‌యం ఆ గ్రామంలోని ఇత‌ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస్తుంది. దీంతో వారు కూడా వినాయ‌కున్ని పూజించ‌డం మొద‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో వారు స్వామి వారికి కొట్టే కొబ్బ‌రికాయ‌ల నుంచి వ‌చ్చే నీరు ఆ గ్రామం అంతా వ్యాపిస్తుంది. దీంతో వారి పంట‌లు ప‌చ్చగా పండుతాయి. గ్రామం సుభిక్షంగా మారుతుంది. అలా వ్య‌వ‌సాయ భూముల్లో నీరు ప్ర‌వ‌హించే స‌రికి ఆ గ్రామం కాణిపాకం అయింది. కాగా కాణిపాకం ఆల‌యాన్ని 11వ శ‌తాబ్దంలో చోళ రాజులు నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది.

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే.. స్వామి వారి విగ్ర‌హం రోజూ కొంత ప‌రిమాణం పెరుగుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అందుకు సాక్ష్యం ఆయ‌న‌కు ధ‌రించే తొడుగులే. ఒక‌ప్పుడు భ‌క్తులు ఆయ‌న విగ్ర‌హానికి చేయించిన తొడుగులు ఇప్పుడు స‌రిపోవ‌డం లేదు. విగ్ర‌హం సైజు పెరిగింది. కావాలంటే భ‌క్తులు ఆలయంలో ఉండే స్వామి వారి తొడుగుల‌ను చూడ‌వ‌చ్చు. అవే ఆయన విగ్ర‌హం పెరుగుతుంద‌న‌డానికి సాక్ష్యాలు..! ఇక స్వామి వారి విగ్ర‌హానికి 50 సంవ‌త్స‌రాల కింద‌ట చేయించిన వెండి క‌వ‌చం కూడా ఇప్పుడు స‌రిపోవ‌డం లేద‌ట‌. ఈ ఒక్క ఆధారం చాలు.. ఆయ‌న విగ్రహం ప‌రిమాణం పెరుగుతుంద‌ని చెప్ప‌డానికి..!

కాణిపాకంలో వినాయ‌కుడి విగ్ర‌హం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్ప‌టికీ ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని ప‌ర‌మ ప‌విత్రంగా భావించి భ‌క్తుల‌కు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయ‌కుడికి స‌త్యానికి మారు పేరు అనే మ‌రో గుర్తింపు కూడా ఉంది. చాలా మంది త‌ప్పులు చేసిన వారిని ఇక్క‌డికి తీసుకువచ్చి ఆల‌యం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తాము చేసిన త‌ప్పుల‌ను ఒప్పుకుంటార‌ని భ‌క్తుల విశ్వాసం. అలాగే ఆల‌య ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో స్వామి వారి వాహ‌న‌మైన ఎలుక ఉంటుంద‌ట‌. దానికి ఇష్ట‌మైన ఏదైనా ప‌దార్థం వేసి స్వామి వారిని ప్రార్థిస్తే అనుకున్నవి జ‌రుగుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

కాణిపాకం ఆల‌యంలో ఎప్పుడూ ఒక పాము తిరుగుతుంటుంద‌ట‌. అది ఎవ‌రికీ అప‌కారం చేయ‌ద‌ట‌. అది దేవ‌తా సర్ప‌మ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. ఇక కాణిపాకం ఆల‌యానికి వెళ్లాలంటే.. తిరుప‌తి నుంచి ప్ర‌తి 15 నిమిషాల‌కు ఒక బ‌స్సు ఉంటుంది. అదే చిత్తూరు నుంచి అయితే ప్ర‌తి 10 నిమిషాల‌కు ఒక బ‌స్సు ఉంటుంది. చంద్ర‌గిరి నుంచి కూడా భ‌క్తులు వెళ్ల‌వ‌చ్చు. అక్క‌డి నుంచి ప్రైవేటు వాహ‌నాలు బాగా ల‌భిస్తాయి. కాణిపాక క్షేత్రం చిత్తూరుకు 11 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుప‌తి నుంచి అయితే కాణిపాకంకు సుమారుగా 68 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM