lifestyle

Potatoes : ఆలుగ‌డ్డ‌ల‌ను తిన్న త‌రువాత మీ శ‌రీరంలో జ‌రిగేది ఇదే.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు..!

Potatoes : ఆలుగ‌డ్డ‌లు.. వీటినే బంగాళాదుంప‌లు అని కూడా అంటారు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేపుడు, చిప్స్ వంటి చిరుతిళ్ల‌తోపాటు ఆలుగ‌డ్డ‌ల‌ను కూర చేసుకుని కూడా తింటారు. అయితే కూర‌గాయ‌ల‌తో పోలిస్తే బంగాళాదుంప‌ల్లో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల కూర‌గాయ‌ల్లో 20 నుంచి 30 వ‌ర‌కు క్యాల‌రీలు ఉంటే బంగాళాదుంప‌ల్లో మాత్రం 97 క్యాల‌రీలు ఉంటాయి. క‌నుక ఆలుగ‌డ్డ‌ల‌ను ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. తింటే అధికంగా బ‌రువు పెరిగే ప్ర‌మాదం ఉంటుంది. అయితే బంగాళా దుంప‌ల‌కు చెందిన ఒక ముఖ్యమైన విష‌యాన్ని ప‌లువురు సైంటిస్టులు ఈ మ‌ధ్య‌నే వెల్ల‌డించారు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాదుంప‌ల‌ను కూర‌గా చేసుకుని తింటే వాటిల్లో ఉండే ప‌లు స‌మ్మేళ‌నాల కార‌ణంగా మ‌న‌కు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కేవ‌లం ఉడ‌క‌బెట్టి లేదా కూర‌గా చేసుకుని మాత్ర‌మే ఆలుగ‌డ్డ‌ల‌ను తినాలి. చిప్స్‌, వేపుళ్లు వంటి వాటి రూపంలో ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌కూడ‌దు. తింటే క‌డుపు నిండిన భావ‌న కాదు, క‌డుపు ఖాళీగా ఉన్న భావ‌న అనిపిస్తుంది. ఎందుకంటే ఆలుగ‌డ్డ‌ల‌ను వేయిస్తే వాటిల్లో ఉండే ఆరోగ్య‌క‌రమైన స‌మ్మేళ‌నాలు న‌శిస్తాయి. అలాంట‌ప్పుడు ఆలును తింటే మ‌న‌కు క‌డుపు నిండిన భావ‌న క‌ల‌గ‌దు. ఫ‌లితంగా మ‌నం ఎక్కువ‌గా తింటాం.

Potatoes

అందుక‌నే చిప్స్‌, వేపుళ్లు వంటివి చేసిన‌ప్పుడు చాలా మంది అధికంగా వీటిని లాగించేస్తుంటారు. ఎందుకంటే ఎంత తిన్నా వీటిని తిన్నాక క‌డుపు నిండిన భావ‌న అనేది క‌ల‌గ‌దు. ఇంకా ఎక్కువ‌గా తినాల‌నిపిస్తుంది. అదే కూర‌గా లేదా ఉడ‌క‌బెట్టుకుని ఆలుగడ్డ‌ల‌ను తింటే త‌క్కువ‌గా తిన్నా క‌డుపు నిండిన‌ట్లు అనిపిస్తుంది. పైగా ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇలా ఆలుగ‌డ్డ‌ల‌ను తింటూ కూడా బరువు త‌గ్గ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM