lifestyle

Tourist Places In Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్ర‌దేశాల‌ను త‌ప్ప‌క చూడండి..!

Tourist Places In Munnar : మున్నార్‌.. కేర‌ళ‌లోని ముఖ్య‌మైన ప‌ర్యాటక ప్ర‌దేశాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో ఎప్పుడూ అల‌రారుతూ ఉంటుంది. ఎటు చూసినా ప‌చ్చ‌ని చెట్లు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, కొండ చ‌రియ‌లు.. ప‌ర్యాట‌కుల‌కు మ‌ధుర‌మైన అనుభూతుల‌ను క‌లిగిస్తుంటాయి. కేర‌ళ రాజ‌ధాని కొచ్చికి 130 కిలోమీట‌ర్ల దూరంలో మున్నార్ ఉంది. అయితే ప‌ర్యాట‌క ప్రేమికులు మున్నార్‌లో చూడ‌ద‌గిన అందాలు, ఆస్వాదించ‌ద‌గిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మున్నార్‌ను సంద‌ర్శించే ప‌ర్యాట‌కులు చాలా మంది అక్క‌డి మౌంటేన్ బైకింగ్‌ను అనుభూతి చెందుతారు. ప‌చ్చ‌ని ప‌ర్వ‌తాల‌పై బైకింగ్ చేస్తే వ‌చ్చే కిక్కే వేరేగా ఉంటుంది. సాహిసికులు ఎక్కువ‌గా మున్నార్‌లో మౌంటేన్ బైకింగ్ అడ్వెంచ‌ర్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. క‌నుక మీరు కూడా ఎప్పుడైనా మున్నార్ వెళితే.. త‌ప్ప‌క ఈ సాహ‌సాన్ని ట్రై చేయండి. మున్నార్‌లోని ఎర‌వికులం నేష‌న‌ల్ పార్క్ 97 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా ఇక్క‌డి వైల్డ్ లైఫ్ స‌ఫారి కోసం ఎంతో మంది ప‌ర్యాట‌కులు విచ్చేస్తుంటారు. అనేక ర‌కాల జీవ‌వైవిధ్యం ఉన్న ప్రాణుల‌కు ఈ పార్కు నిల‌యంగా మారింది. మున్నార్ లో ఉన్న చూడ‌ద‌గిన ప్ర‌దేశాల్లో ఇదొక‌టి.

Tourist Places In Munnar

కుంద‌ల స‌ర‌స్సులో ఈ రైడ్ ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంది. ప‌చ్చ‌ని కొండ‌చ‌రియ‌లు, ద‌ట్ట‌మైన చెట్లతో ఉన్న అర‌ణ్యం మ‌ధ్య‌లో అత్యంత చీక‌ట్లో ఈ రైడ్ సాగుతుంది. సాహసికులు ఇక్క‌డ గొప్ప అనుభూతి చెంద‌వ‌చ్చు. ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో గ‌డిపితే అన్ని ఆందోళ‌న‌లు పోతాయి. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అందుకే మున్నార్ లో ప‌ర్యాట‌కుల‌కు ఆయుర్వేద స్పాలు స్వాగతం ప‌లుకుతుంటాయి. కేర‌ళ‌కు చెందిన సంప్ర‌దాయ నృత్యాల్లో క‌థ‌క‌ళి ఎంతో పేరుగాంచింది. నైపుణ్యం ఉన్న క‌ళాకారులు ప్ర‌దర్శించే నృత్యాన్ని క‌చ్చితంగా ప‌ర్యాట‌కులు చూడాల్సిందే. వారి లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌ర్యాట‌కుల క‌ళ్ల‌ను క‌ట్టి ప‌డేస్తాయి.

మున్నార్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చాలా ఫేమ‌స్సే. ఇక్క‌డికి వ‌చ్చే అనేక మంది ప‌ర్యాట‌కులు ప‌చ్చని కొండ‌చ‌రియ‌ల‌పైకి ట్రెక్కింగ్ చేస్తారు. సాహ‌సంతో కూడిన యాత్ర‌లు చేస్తారు. కార్మెల‌గిరిలో ఉన్న ఏనుగుల పార్క్ మున్నార్ ద‌గ్గ‌ర‌ చాలా ప్ర‌సిద్ధి గాంచింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఏనుగుల‌ను చూస్తూ విహ‌రించ‌వ‌చ్చు. మున్నార్‌లోని కొలుక్కుమ‌లై టీ ప్లాంటేషన్ చ‌క్క‌ని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు అద్దం ప‌డుతుంటుంది. ఇక్క‌డి కొండ‌చ‌రియ‌ల‌పై ఉండే తేయాకు తోట‌లు ప‌ర్యాట‌కుల చూపును తిప్పుకోనీయ‌కుండా చేస్తాయి. మున్నార్ లో టీ మ్యూజియం కూడా ఉంది. 2005 లో దీన్ని ప్రారంభించారు. ఇందులో టీ త‌యారీ గురించి ప‌ర్యాట‌కులు తెలుసుకోవ‌చ్చు. అలాగే ప‌లు భిన్న‌మైన రకాల‌కు చెందిన టీ రుచుల‌ను కూడా ఇక్కడ ఆస్వాదించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM