lifestyle

Ghost Signs And Symptoms : ఈ సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ చుట్టు ప‌క్క‌ల దెయ్యం ఉన్న‌ట్లే..!

Ghost Signs And Symptoms : దెయ్యం పేరు చెప్ప‌గానే భ‌య‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. దెయ్యం గురించి మాట్లాడుకుంటే చాలు.. ప్యాంట్లు త‌డుపుకునే వారు కూడా చాలా మందే ఉంటారు. ఇక అలాంటి వారు హార్ర‌ర్ సినిమాలు చూడ‌డం అసంభ‌వం అని చెప్ప‌వ‌చ్చు. చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే దెయ్యాలు, భూతాలు అంటే భ‌యం ఉండ‌దు. స‌రే వీరి సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అస‌లు నిజంగా దెయ్యాలు ఉంటాయా ? ఉంటే.. అవి మ‌న ద‌గ్గ‌రకే వ‌స్తే.. మ‌న చుట్టూ తిరుగుతుంటే.. ఎలాంటి చిహ్నాలు, సూచన‌లు మ‌న‌కు కనిపిస్తాయి ? ఎప్పుడైనా అలాంటి సూచ‌న‌ల గురించి మీరు విన్నారా ? విన‌లేదా..! అయితే.. ఇప్పుడు తెలుసుకుందాం.. అస‌లు దెయ్యం అంటూ మ‌న ద‌గ్గ‌రే ఉంటే.. మ‌న‌కు ఎలాంటి చిహ్నాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దెయ్యం మ‌న ద‌గ్గ‌రే ఉందని చెప్ప‌డానికి ప్ర‌ధాన చిహ్నం.. చిన్న‌పాటి శ‌బ్దాలు.. వాటిని విన‌గ‌లిగితే దెయ్యం మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు తెలుస్తుంది. అంతా ప్ర‌శాంతంగా, నిశ్శ‌బ్దంగా ఉన్న‌ప్పుడు వింతైన చిన్న, చిన్న శ‌బ్దాలు వ‌స్తుంటే.. వాటిని ఎవరైనా వింటే.. అప్పుడు దెయ్యం ఉన్న‌ట్లు భావించాలి. దెయ్యాలు ఇంట్లో ఉంటే.. కుక్క‌, పిల్లి లాంటి పెంపుడు జంతువులు చిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంటాయ‌ట. అలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తే దెయ్యం ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఉండే కుర్చీలు, టేబుల్స్‌, తాళం చెవులు.. త‌దిత‌ర వ‌స్తువులు మీరు ఉంచిన చోట కాకుండా వేరే చోట క‌నిపిస్తున్నాయా ? ఇత‌రులెవ‌రూ వాటిని క‌నీసం ట‌చ్ కూడా చేయ‌డం లేదా ? అయితే అది నిజంగా దెయ్యాల ప‌నే.

Ghost Signs And Symptoms

మారిన్ హాంకాక్ అనే ఓ దెయ్యాల స్పెష‌లిస్టు చెబుతున్న ప్ర‌కారం.. అర్థ‌రాత్రి 3 నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు దెయ్యాల ప‌వ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఆ స‌మ‌యంలో గ‌న‌క మీకు నిత్యం మెళ‌కువ వ‌స్తుంటే.. అది దెయ్యాల ప‌నే అని గ్ర‌హించాల‌ట‌. ఇది కూడా మీ ద‌గ్గ‌ర దెయ్యం ఉంద‌ని చెప్ప‌డానికి ఒక నిద‌ర్శ‌నం. దెయ్యాలు నివాసంలో ఉంటే.. అందులో ఉండే వారి శ‌రీరంపై రక్కిన‌ట్టు గాయాలు అవుతాయ‌ట‌. రాత్రి పూట అయ్యే ఈ గాయాలు తెల్ల‌వారు జామున లేచి చూస్తే క‌నిపిస్తాయి. కానీ ఆ గాయాలు ఎలా అయ్యాయో తెలియ‌ద‌ట‌.

పీడ‌క‌ల‌లు బాగా వ‌స్తుంటే ఇంట్లో దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌. మీ ద‌గ్గ‌ర ఉన్న ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులైన టీవీ, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూట‌ర్ త‌దిత‌ర వ‌స్తువులు డిస్ట‌ర్బెన్స్‌ను ఎదుర్కొంటే దెయ్యం ఉన్న‌ట్లు భావించాల‌ట‌. దెయ్యం ఉంటే ఆ నీడ‌లు బాగా క‌నిపిస్తాయ‌ట‌. కానీ చూస్తే మ‌నుషులెవ‌రూ ఉండ‌రు. ఇది దెయ్యం ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నం. గదిలో ఉష్ణోగ్ర‌త దానిక‌దే ఇష్టం వ‌చ్చిన‌ట్లు మారుతుంటే దెయ్యం ఉంద‌ని భావించాల‌ట‌. దెయ్యాల స్పెష‌లిస్టు మారిన్ హాంకాక్ చెబుతున్న ప్ర‌కారం.. ఇంట్లో దెయ్యం ఉంటే రాత్రి పూట‌ గ‌డియారంలో టైము 11:11 అయిన‌ప్పుడు మీరు దాని వంక ఆటోమేటిక్‌గా చూస్తార‌ట‌.

మిమ్మ‌ల్ని ఎవ‌రో చూస్తున్న‌ట్లు, మీతో మాట్లాడాల‌ని వారు అనుకుంటున్న‌ట్లు మీకు భావ‌న క‌లిగినా.. అది దెయ్యం ఉంద‌న‌డానికి బ‌ల‌మైన చిహ్న‌మ‌ట. దెయ్యాలు తాము మాట్లాడాల‌నుకునే వారిని ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి చిన్న‌గా పిలుస్తాయ‌ట‌. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని పిలిచిన‌ట్లు చిన్న‌గా శ‌బ్దం వ‌స్తే అది దెయ్యం ప‌నే. మీ చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్లో నుంచి అద్భుత‌మైన సువాస‌న వ‌స్తుంది. కానీ అది ఎక్క‌డి నుంచి వ‌స్తుందో తెలియ‌కపోతే అది కూడా దెయ్యం ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM