lifestyle

Men Vs Women Brain : పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటుంద‌ట తెలుసా..?

Men Vs Women Brain : మ‌న శ‌రీరానికి ఉండే వ‌య‌స్సు మాత్ర‌మే కాకుండా మన ఆరోగ్య స్థితి, వ్యాధులు, ఇత‌ర వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌న బ‌యోలాజిక‌ల్ ఏజ్ కూడా ఒక‌టి ఉంటుంది తెలుసు క‌దా. అయితే ఇదే కాదు, ఇప్పుడు మ‌న మెద‌డుకు కూడా ఏజ్ ఉంటుంద‌ట‌. అంతేకాదు, మెద‌డు విష‌యంలో పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం తెలిసింది.

అమెరికాకు చెందిన ప‌లువురు సైంటిస్టులు ఈ మ‌ధ్యే 121 మంది స్త్రీలు, 84 మంది పురుషుల‌పై అధ్య‌య‌నం చేశారు. వారి మెద‌డు మెట‌బాలిజం, మెద‌డుకు జ‌రుగుతున్న ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, మెద‌డు గ్లూకోజ్ వినియోగం త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. దీంతోపాటు వారికి కొన్ని పజిల్స్ పెట్టారు. చివ‌ర‌కు సైంటిస్టులు ఏం తేల్చారంటే.. పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డు షార్ప్‌గా ఉంటుంద‌ట‌. అలాగే స్త్రీ మెద‌డే పురుషుల మెద‌డు క‌న్నా య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట‌. అంటే స్త్రీల అస‌లు వయ‌స్సు క‌న్నా వారి మెద‌డు వ‌య‌స్సు 3.8 ఏళ్లు త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు స్త్రీ వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు అనుకుంటే వారి మెద‌డు వ‌య‌స్సు 26.2 ఏళ్లే అన్న‌మాట.

Men Vs Women Brain

అలాగే పురుషుల అస్స‌లు వ‌య‌స్సు క‌న్నా వారి మెద‌డు వ‌య‌స్సు 2.4 సంవ‌త్స‌రాలు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు పురుషుడి వ‌య‌స్సు 30 ఏళ్లు అనుకుంటే అత‌ని మెద‌డు వ‌య‌స్సు 32.4 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌న్న‌మాట. అందువ‌ల్లే సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డిన కొద్దీ మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోవ‌డంతోపాటు అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు పురుషుల‌కే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే స్త్రీల‌కు వ‌య‌స్సు మీద ప‌డిన‌ప్ప‌టికీ వారి మెద‌డు వ‌యస్సు త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక వారికి జ్ఞాప‌క‌శ‌క్తి, మెంట‌ల్ అల‌ర్ట్‌నెస్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని, వారి మైండ్ షార్ప్‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను అమెరికాకు చెందిన నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ అనే ఓ జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM