Longer Life : మనిషి 100 ఏళ్లకు పైబడి జీవించడమంటే.. ప్రస్తుత తరుణంలో అది కొంత కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో అర్థం కావడం లేదు. దీనికి తోడు అన్నీ కాలుష్యమయం అయిపోయాయి. కెమికల్స్‌తో పండించిన కూరగాయలు, పండ్లను తింటున్నాం. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం సమస్యలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 60 నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా జీవిస్తేనే గొప్ప విషయం అయిపోయింది. అయితే 100 ఏళ్ల పైబడి జీవించాలంటే ఏం చేయాలి ? అంటే.. అందుకు ప్రపంచంలో ఈ 5 దేశాలకు చెందిన ప్రజలు పాటించే జీవన విధానాన్ని పాటించాలి. దాంతో 100 ఏళ్లకు పైబడి జీవించవచ్చట.
ఇటలీలోని సార్డినియా, జపాన్‌లోని ది ఐల్యాండ్స్ ఆఫ్ ఒకినవ, కాలిఫోర్నియాలోని లొమా లిండా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్‌లోని ఇకరియా ప్రాంతాలను బ్లూ జోన్స్ అని వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సుమారుగా 100 ఏళ్ల పైబడే జీవిస్తున్నారట. అందుకు కారణం ఈ ప్రాంతాల్లో ఉన్న వారు కామన్‌గా పాటించే జీవన విధానం ఒకటుంది. దాంతోనే వారు అంత ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారట. మరి ఆ ప్రాంతవాసులు పాటించే ఆ లైఫ్ స్టైల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఏ వ్యక్తి అయినా 100 ఏళ్లకు పైబడి జీవించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ సభ్యులు, సమాజంతో చక్కని అనుబంధం కలిగి ఉండాలి. ధూమపానం, మద్యపానం చేయరాదు. కానీ రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. అయితే రెడ్‌వైన్‌ను మితంగానే తాగాలి. మాంసాహారం మానేయాలి. అవును, మీరు మాంసాహార ప్రియులు అయినా సరే.. ఆ ఆహారాన్ని తీసుకోవడం మానేయాల్సిందే. ఎందుకంటే శాకాహార భోజనం తినేవారు మాత్రమే 100 ఏళ్లకు పైబడి బతుకుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే పైన చెప్పిన ఆ 5 ప్రాంతాల వాసులు కామన్‌గా, ఎక్కువగా తినేది శాకాహారమే. కనుక ఆ ఆహారాన్ని తీసుకుంటే 100 ఏళ్లకు పైబడి జీవించవచ్చు.
నిత్యం వ్యాయామం చేయాలి. కఠినతర వ్యాయామం అవసరం లేదు. సాధారణ వ్యాయామం అయినా సరే.. రోజూ చేయాలి. రోజూ కచ్చితంగా 8 గంటలు నిద్రించాలి. చాలా త్వరగా పడుకుని త్వరగా నిద్ర లేవాలి. ఈ జీవనశైలి పాటిస్తే ఎవరైనా 100 ఏళ్లకు పైబడి జీవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…