Soaked Raisins : ద్రాక్ష పండ్లను ఎండ బెట్టి తయారు చేసే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్టమే. వీటినే కిస్ మిస్ పండ్లని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా స్వీట్లు, తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్షలను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయట. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పైన చెప్పినట్టుగా నిత్యం కొన్ని ఎండు ద్రాక్షలను తింటుంటే దాంతో రక్తం బాగా తయారవుతుంది. విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు కిస్ మిస్ పండ్లలో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులకు అడ్డుగోడగా నిలుస్తాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్షలను తినడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, పిల్లలకు కిస్ మిస్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.
రక్తంలో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్షలను తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్షలతోపాటు కొన్నివెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
జీర్ణ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. ఎండుద్రాక్షలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వైరల్ జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లతో బాధ పడే వారు కిస్ మిస్ పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…