lifestyle

Immune Boosting Tonique : ఇంట్లో తయారు చేసిన ఈ టానిక్ ని రోజుకి 5 స్పూన్లు తాగితే చాలు.. ఏ రోగం మీ దరిచేరదు..

Immune Boosting Tonique : మాన‌వ శరీరంలోని రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉన్న‌ప్పుడే ఏ వ్యాధినైనా అది రాక‌ముందే చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు వీలు క‌లుగుతుంది. శ‌రీరంలోకి ప్ర‌వేశించిన క్రిముల‌ను, సూక్ష్మ జీవుల‌ను వెంట‌నే చంపగ‌లిగే ప‌వ‌ర్‌ఫుల్ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఉంటేనే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రావు. త‌ద్వారా ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే నేటి యుగంలో అంతా కృత్రిమ‌మే అయిపోయింది. ఈ క్ర‌మంలో ఎవ‌రికైనా వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చాయంటే చాలు రోజుల త‌ర‌బ‌డి హాస్పిట‌ల్స్‌కు ప‌రిగెత్తుతూ చికిత్స చేయించుకోవాల్సి వ‌స్తోంది.

అదే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటే అలాంటి ఇబ్బందులు రావు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఓ ప‌వ‌ర్‌ఫుల్ డ్రింక్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుని నిత్యం తాగితే దాంతో మీ శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రావు. ఒక వేళ ఎవ‌రైనా ఇప్ప‌టికే ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌తో బాధ‌ప‌డుతుంటే అవి కూడా త‌గ్గిపోతాయి. ఆ డ్రింక్ ఏమిటో, దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌వ‌ర్‌ఫుల్ డ్రింక్‌ను త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌ట్ చేసిన వెల్లుల్లి ముక్క‌లు – 1/4 క‌ప్పు, క‌ట్ చేసిన ఉల్లిపాయ ముక్క‌లు – 1/4 క‌ప్పు, ప‌సుపు – 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ – 700 ఎంఎల్, బాగా పండిన మిర‌ప కాయ‌లు – 2, తురిమిన అల్లం – 1/4 క‌ప్పు, తురిమిన ముల్లంగి – 2 టేబుల్ స్పూన్లు.

Immune Boosting Tonique

త‌యారు చేసే విధానం..

వెనిగర్ త‌ప్ప మిగిలిన అన్ని ప‌దార్థాల‌ను ఒక పాత్ర‌లో వేసి బాగా క‌లుపుకోవాలి. దాన్ని ఒక జార్‌లోకి మార్చాలి. ఆ జార్‌లోకి యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వంపాలి. దీంతో జార్ నిండా నిండిపోతుంది. అనంత‌రం జార్‌ను మూసి బాగా షేక్ చేయాలి. చ‌ల్ల‌గా, పొడిగా ఉండే వాతావ‌ర‌ణంలో ఆ జార్‌ను 2 వారాల పాటు అలాగే ఉంచాలి. నిత్యం ఆ జార్‌ను బాగా షేక్ చేస్తూ ఉండాలి. 14 రోజుల త‌రువాత జార్ ఓపెన్ చేసి అందులోని మిశ్ర‌మాన్ని పిండుతూ ద్ర‌వాన్ని వేరు చేసుకోవాలి. అలా వ‌చ్చిన ద్ర‌వాన్ని మ‌ళ్లీ ఇంకో బాటిల్‌లోకి సేక‌రించి దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ ద్ర‌వాన్ని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే ద్ర‌వాన్ని వేరు చేయ‌గా వ‌చ్చిన మిశ్ర‌మాన్ని వంటల్లోనూ వాడుకోవ‌చ్చు.

పైన చెప్పిన విధంగా సేక‌రించిన ద్ర‌వాన్ని నిత్యం 60 ఎంఎల్ మోతాదులో రోజులో ఏదో ఒక స‌మ‌యంలో తీసుకోవాలి. కానీ ప‌ర‌గ‌డుపున మాత్రం తాగ‌కూడ‌దు. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా ఉన్న‌వారు 100 ఎంఎల్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చు. లేదంటే 50 ఎంఎల్ చొప్పున రెండు సార్లు, 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే 5 నుంచి 6 సార్ల వ‌ర‌కు ఒక రోజులో తాగ‌వ‌చ్చు. అయితే ఈ ద్ర‌వం రుచిలో కొంత ఘాటుగా ఉంటుంది. దాన్ని త‌ట్టుకోలేమ‌నుకునే వారు కొద్దిగా నీటికి క‌లిపి తీసుకోవ‌చ్చు.

ఇంట్లోనే మీరు ఈ విధంగా పైన చెప్పిన ద్ర‌వాన్ని టానిక్ రూపంలో నిత్యం తాగుతుంటే దాంతో మీ శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా మారుతుంది. ఈ టానిక్‌లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ పారాసైటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. దీని వ‌ల్ల మీ శ‌రీరంలో ఉన్న ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ అయినా చాలా వేగంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ టానిక్‌లో ఉన్న వెల్లుల్లి స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా పనిచేస్తూ వ్యాధులను న‌యం చేస్తుంది. బాక్టీరియా, సూక్ష్మ క్రిముల‌ను నిర్మూలిస్తుంది. ఉల్లిపాయ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ప‌సుపు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తుంది. బాక్టీరియాల‌ను అంతం చేస్తుంది. క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కార‌కంగా ప‌నిచేస్తుంది. బ‌రువును కూడా త‌గ్గిస్తుంది. మిర‌ప‌కాయ‌లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేస్తూ బాక్టీరియాల‌ను నిర్మూలిస్తాయి. అల్లం యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బయోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ స్పాస్మోడిక్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఆస్త‌మా, బీపీల‌ను నియంత్రిస్తుంది. ముల్లంగి శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. ఇన్ని ప‌వ‌ర్‌ఫుల్ గుణాలు ఉన్న ప‌దార్థాల‌ను వాడుతాం కాబ‌ట్టే పైన చెప్పిన ద్ర‌వం అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన‌, ప‌వ‌ర్‌ఫుల్ ఇమ్యూన్ బూస్టింగ్ టానిక్‌గా మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM