Taking Pills : మనకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్లచే పరీక్ష చేయించుకుని వారు రాసే మందులను తెచ్చుకుని మింగుతుంటాం. దీంతో ఆ అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. వాటి నుంచి మనం బయటపడతాం. అయితే దాదాపుగా ఏ టానిక్ లేదా మందు బిళ్ల అయినా సరే.. చేదుగానే ఉంటుంది. దీంతో ఆ చేదు మందులను మింగాలంటే కొందరు జంకుతుంటారు. అయితే అసలు నిజానికి ఏ మందు బిళ్లలనైనా ఎలా మింగాలో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.
మందు బిళ్లను మింగేందుకు మనకు రెండు ఉత్తమమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి.. ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. అందులో తగింత నీరు నింపుకోవాలి. మీరు మింగాలనుకునే టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి. రుచికళిలకు దూరంగా నాలుకపై టాబ్లెట్‌ను ఉంచాలి. లేదంటే చేదు తగులుతుంది. అనంతరం బాటిల్ ఓపెనింగ్‌ను పెదాలకు దగ్గరగా పెట్టుకుని పెదాలను ఆ ఓపెనింగ్ చుట్టూ బిగించి నీటిని తాగాలి. అలా నోట్లోకి గాలి చొరబడకుండా టాబ్లెట్‌ను మింగాలి.
ఇక టాబ్లెట్లను మింగేందుకు మరొక పద్ధతి.. టాబ్లెట్‌ను నాలుక మీద పెట్టుకోవాలి. నీళ్లను ఒక సిప్ వేసి కొంత నీటిని నోట్లోకి తీసుకోవాలి. కానీ టాబ్లెట్‌ను మింగకూడదు. గడ్డాన్ని కొద్దిగా కిందకు దించాలి. ఆ తరువాత తల కిందకు వంగగానే టాబ్లెట్‌ను, నీటిని కలిపి మింగాలి. ఇప్పుడు చెప్పిన రెండు పద్ధతులు టాబ్లెట్లను మింగేందుకు అనువైనవి. వీటి ద్వారా 80 శాతం వరకు టాబ్లెట్లను చాలా సులభంగా మింగవచ్చు. అయితే టాబ్లెట్లను బాగా మింగగలిగే వారు ఈ పద్ధతులను పాటించాల్సిన పనిలేదు. తమకు తోచినట్లుగా టాబ్లెట్లను మింగవచ్చు. అదే టాబ్లెట్లను మింగేందుకు జంకే వారు ఈ పద్ధతులను పాటించవచ్చు. కానీ ఈ కొత్త పద్ధతులను పాటించే ముందు ఎందుకైనా మంచిది.. జాగ్రత్త వహించండి.. పక్కనే ఎవరైనా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి టాబ్లెట్లు గొంతులో ఇరుక్కుని (చోకింగ్) ప్రాణాలు పోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక టాబ్లెట్లను మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…