lifestyle

Mushrooms : పుట్ట‌గొడుగుల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Mushrooms : పుట్టగొడుగులు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం ఉంటుంది. వీటితో పలు రకాల వంటలు చేసుకుని చాలా మంది తింటుంటారు. పుట్టగొడుగులతో చేసే ఏ వంటకమైనా భోజన ప్రియులకు నచ్చుతుంది. ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులు శాకాహార ప్రియుల‌కు కూడా ఎంతగానో నచ్చుతాయి. అయితే పుట్టగొడుగుల్లో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో పోషకాల‌తోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే పుట్టగొడుగులను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల‌ మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులను తరచూ తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలో వాపులను తగ్గిస్తాయి. అలాగే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ తో బాధపడే వారు వీటిని తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పుట్టగొడుగుల్లో మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. జీర్ణ సమస్యల‌ను పోగొడుతుంది. పుట్టగొడుగులలో ఉండే ఐరన్ అనీమియా ఉన్న పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. వారిలో రక్తం పెరిగేలా చేస్తుంది. ఎర్ర‌ రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.

Mushrooms

ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో పుట్టగొడుగులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను కూడా త‌గ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కి పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే సెలీనియం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. వృద్ధాప్య ఛాయలను అంత త్వరగా రానివ్వదు. దీంతో ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. పుట్టగొడుగుల‌లో ఉండే కాపర్, పొటాషియం వెంట్రుకల సాంద్రతను పెంచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పుట్టగొడుగుల‌ను త‌ర‌చూ తినడం వల్ల ఫ్లూ జ్వరం, ఆటలమ్మ తదితర వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ లభిస్తుంది. బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పుట్టగొడుగులకు ఉంటుంది. పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పైన చెప్పిన ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM